PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9f5dac3f-c133-494c-9fdf-6b53c6c778af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9f5dac3f-c133-494c-9fdf-6b53c6c778af-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పొత్తుల వైపు దృష్టి సారించని జగన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పొత్తుల వల్ల కలిసొచ్చే లాభాలేంటో వైసీపీకి బాగా అర్ధం అయింది. ముఖ్యంగా 40 శాతం ఓట్లు వైసీపీకి వచ్చినప్పటికీ కేవలం ఆ పార్టీ 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక ఎన్నికల తర్వాత ఏపీలో గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. వైసీపీ నాయకులు, సానుభూతిపరులపై టీడీపీ దాడులు చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో 36 jagan{#}udhayanidhi stalin;Akhilesh Yadav;Tamilnadu;Stalin;Shiv Sena;Delhi;Sharmila;TDP;politics;YCP;India;Congress;MLA;Janasena;Jagan;CM;Partyఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీతో జతకట్టనున్న జగన్?ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీతో జతకట్టనున్న జగన్?jagan{#}udhayanidhi stalin;Akhilesh Yadav;Tamilnadu;Stalin;Shiv Sena;Delhi;Sharmila;TDP;politics;YCP;India;Congress;MLA;Janasena;Jagan;CM;PartyWed, 31 Jul 2024 10:37:00 GMTఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పొత్తుల వైపు దృష్టి సారించని జగన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పొత్తుల వల్ల కలిసొచ్చే లాభాలేంటో వైసీపీకి బాగా అర్ధం అయింది. ముఖ్యంగా 40 శాతం ఓట్లు వైసీపీకి వచ్చినప్పటికీ కేవలం ఆ పార్టీ 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక ఎన్నికల తర్వాత ఏపీలో గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. వైసీపీ నాయకులు, సానుభూతిపరులపై టీడీపీ దాడులు చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇటీవలే ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అక్కడ ధర్నాలో రాజకీయ హత్యలపై ఫొటోలతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో రాజకీయాల్లో ఊహించని ఘటన జరిగింది. కాంగ్రెస్ తప్పా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పలు కీలక పార్టీలు జగన్‌ నిరసన శిబిరానికి వచ్చి మద్దతు తెలిపాయి. దీంతో జగన్ త్వరలో ఇండియా కూటమిలో చేరనున్నారనే ప్రచారం ఏపీలో ఊపందుకుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

జగన్ ఢిల్లీ ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వచ్చారు. జగన్‌కు మద్దతు ప్రకటించారు. డీఎంకే పార్టీ, ఎన్సీపీ, శివసేన సహా ప్రతిపక్ష ఇండియా కూటమికి పార్టీల నేతలు జగన్‌కు సంఘీభావం తెలిపారు. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ అత్యంత సన్నిహితుడు. గతంలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం ఆయన వచ్చారు. ఆయనతో పాటు అఖిలేష్ యాదవ్‌ కూడా జగన్‌ను ఇండియా కూటమిలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కూడా జగన్ పట్ల సానుకూలంగా ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలోనూ లేదు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. ఈ తరుణంలో రాజకీయ దాడులను తట్టుకునేందుకు జాతీయ స్థాయిలో ఎన్డీయే వ్యతిరేక కూటమి ఇండియా పక్షంలో చేరాలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్ ధర్నాకు కాంగ్రెస్ రాకపోయినప్పటికీ ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే పార్టీల కీలక నేతలు వెళ్లారు. ఏపీలో రాజకీయ దాడులను ఖండిస్తూ జగన్‌ పట్ల వారు సానుకూల వైఖరి ప్రదర్శించారు. రానున్న కాలంలో ఇండియా కూటమిలో వైసీపీ చేరితే ఏపీలోనూ కాంగ్రెస్, వైసీపీ జట్టుకట్టనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఎటువైపు పడతాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>