PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu5826b995-516f-425e-b0ba-9d927484f79e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu5826b995-516f-425e-b0ba-9d927484f79e-415x250-IndiaHerald.jpg ప్ర‌జ‌ల‌తో వారి స‌మ‌స్య‌ల‌తో కిట‌కిట‌లాడుతోంది. వారు చెప్పుకొనేందుకు ఒక వేదిక వేదిక ఏర్ప‌డింది. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చే వారు నిత్యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. ఇదేస‌మ‌యంలో ఉండ‌వ‌ల్లిలోchandrababu{#}Lokeshకూట‌మి సూప‌ర్ హిట్ షోకు అదే కార‌ణ‌మా..?కూట‌మి సూప‌ర్ హిట్ షోకు అదే కార‌ణ‌మా..?chandrababu{#}LokeshWed, 31 Jul 2024 16:13:43 GMTప్ర‌జాద‌ర్బార్‌.. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ చేప‌ట్టిన కీల‌క కార్య‌క్ర‌మం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వినేందుకు.. క‌నేందుకు.. ప్రాధాన్యం ఇస్తూ.. తొలుత మంత్రి నారా లోకేష్(మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్ట‌కుండానే) చేప‌ట్టి న కార్య‌క్ర‌మం. దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌జ‌లు భారీ ఎత్తున వ‌చ్చిన త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిం చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ త‌ర్వాత‌.. దీనిని పలువురు మంత్రులు కూడా అందిపుచ్చుకున్నా రు. ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రులు కూడా ప్ర‌జా ద‌ర్బార్‌లు నిర్వ‌హిస్తున్నారు.


మ‌రీ ముఖ్యంగా ఒక‌ప్పుడు పార్టీ కార్యక్ర‌మాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఎన్టీఆర్ భ‌వ‌న్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌తో వారి స‌మ‌స్య‌ల‌తో కిట‌కిట‌లాడుతోంది. వారు చెప్పుకొనేందుకు ఒక వేదిక వేదిక ఏర్ప‌డింది. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చే వారు నిత్యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. ఇదేస‌మ‌యంలో ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో మంత్రి నారా లోకేష్ కూడా ప్ర‌జాద‌ర్బార్ నిత్యం నిర్వ‌హిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకు.. వారు చెప్పుకొనేందుకు మంత్రులు చేరువ‌గా ఉన్నార‌నే సంకేతాల‌ను పంపించారు.


ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే..ఇక్క‌డ జ‌రుగుతున స‌మ‌స్య ల ప‌రిష్కారం విష‌యంలో మిశ్ర‌మ స్పంద‌నే వ‌స్తోంది. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కూడిన అంశాల‌ను మాత్రం మంత్రులు కూడా ప‌రిష్క‌రించ‌లేక పోతున్నారు. స‌మ‌స్య‌లు తీసుకుంటున్నారు. ప‌రిష్క‌రిస్తామ‌ని  హామీలు కూడా ఇస్తున్నారు. కానీ, అవి ప‌రిష్కారం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఖ‌జానాలో నిధులు లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రుగుతోంద‌న్న వాద‌న ఉంది. అయితే.. ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను మాత్రం ప‌రిష్క‌రిస్తున్నారు.


గ‌తంతో పోల్చుకుంటే..
ఇక‌, వైసీపీ హ‌యాంతో పోల్చుకుంటే.. ఇప్పుడు ప్ర‌జ‌లు కొంత మేర‌కు సంతోషిస్తున్నార‌నే చెప్పాలి. అప్ప‌ట్లో మంత్రుల‌ను క‌ల‌వాల‌న్నా.. కూడా ఇబ్బందులు వ‌చ్చేవి. ఇక‌, స‌మాధానం మాట దేవుడెరుగు. ఇప్పుడు అలా కాకుండా.. మంత్రులు చేరువ‌గా ఉండ‌డంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఏంట‌నేది వారికి తెలుస్తోంది. ప్ర‌జ‌ల‌కు కూడా మంత్రులే నేరుగా త‌మ స‌మ‌స్య‌లు వింటున్నార‌న్న సంతోషం కూడా క‌లుగుతోంది. మొత్తానికి ప్ర‌జాద‌ర్బార్ కార్య‌క్ర‌మం మూడు పువ్వులు.. ఆరు కాయ‌లుగా సాగుతుండ‌డం మెచ్చుకోద‌గ్గ విష‌యం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>