PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysr-family-politics668ef4cf-a287-4315-aa0a-abebf0eeba9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysr-family-politics668ef4cf-a287-4315-aa0a-abebf0eeba9c-415x250-IndiaHerald.jpgననే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షరాలుగా ఉండి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన షర్మిల ఉమ్మడి కడప జిల్లాల్లో అన్న జగన్ పార్టీకి అదిరిపోయే షాక్ ఇచ్చారు. షర్మిల ఇచ్చిన షార్ట్ దెబ్బతో ఉమ్మడి కడప జిల్లాలో జగన్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. రాజంపేట - కడప పార్లమెంటు స్థానాలలో ysr family politics{#}kadapa;Rajampet;Sharmila;Assembly;Congress;Party;Jagan;media;YCP;Andhra Pradeshఅన్న‌కు షాక్ ఇస్తోన్న ష‌ర్మిల‌... మామూలు దెబ్బ కాదుగా..?అన్న‌కు షాక్ ఇస్తోన్న ష‌ర్మిల‌... మామూలు దెబ్బ కాదుగా..?ysr family politics{#}kadapa;Rajampet;Sharmila;Assembly;Congress;Party;Jagan;media;YCP;Andhra PradeshWed, 31 Jul 2024 16:38:12 GMTవైసీపీ అధినేత వైయస్ జగన్ కు ఆయన సోదరి వై ఎస్‌. షర్మిల భారీ షాక్ ఇస్తున్నారా ? అంటే అవుననే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షరాలుగా ఉండి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన షర్మిల ఉమ్మడి కడప జిల్లాల్లో అన్న జగన్ పార్టీకి అదిరిపోయే షాక్ ఇచ్చారు. షర్మిల ఇచ్చిన షార్ట్ దెబ్బతో ఉమ్మడి కడప జిల్లాలో జగన్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. రాజంపేట - కడప పార్లమెంటు స్థానాలలో కూడా వైసిపి చావు తప్పి కన్నులొట్ట‌ పోయింది. ఇక ఏపీలో వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలకు కూడా ప్రతిపక్షంలో సరైన పాత్ర పోషించడం లేదని జాతీయ మీడియా మొత్తం చెబుతోంది.


ఇక్కడే జగన్కు చెల్లి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతుంది అంట. 151 యొక్క స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవంగా జగన్ ప్రతిపక్షపాత్ర పోషించాలి .. అసెంబ్లీకి వెళ్లి అక్కడ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తాల్సి ఉంటుంది .. అయితే జగన్ మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళేది లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు తనకు మాట్లాడే అవకాశం ఇస్తే తప్ప సభలో అడుగు పెట్టనని కూడా చెపుతున్నారు. అయితే అంతకుముందు సభలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా కొన్ని పార్టీలు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాయి.


గతంలో అనేకమంది కమ్యూనిస్టులు సభలను దడదడలాడించారు. ఎంతమంది సంఖ్యాబలం ఉంది అన్నది కాదు ఎంత బలమైన సబ్జెక్టును ఎంచుకున్నాం .. అన్నదే సభలో కీలకంగా ఉంటుంది. అయితే జగన్ అధికారం ఉంటే తప్ప ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి వెళ్లరన్న వాదన గతం నుంచి ఉంది. ఇది మరోసారి ఆయన రుజువు చేసుకున్నట్లు అయింది. అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఉపయోగం ఉండదన్న చర్చలు కూడా జాతీయ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>