Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sanju251e6ba5-b3a8-4385-99a2-40b7ab31e9ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sanju251e6ba5-b3a8-4385-99a2-40b7ab31e9ba-415x250-IndiaHerald.jpgఇండియన్ క్రికెట్ లో ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు తక్కువ సమయంలోనే భారత జట్టులో చోటు దక్కించుకోవడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి ఆటగాళ్లపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ ఇక జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు ఎంతోమంది యంగ్ ప్లేయర్లు. భారత జట్టులోకి వస్తుంటే ఒక సీనియర్ ప్లేయర్ మాత్రం అటు టీమిండియాలో అడపాదడబా అవకాశాలను మాత్రమే దక్కించుకుంటున్నాడు. అతను ఎవరో కాదు సంజూ శాంసన్. ఇండSanju{#}Cricket;Sri Lanka;Yuva;ICC T20;INTERNATIONAL;Yevaru;Indianఈ గణాంకాలు చూసి కూడా.. సంజూకి ఇంకా ఛాన్సులు వస్తాయా?ఈ గణాంకాలు చూసి కూడా.. సంజూకి ఇంకా ఛాన్సులు వస్తాయా?Sanju{#}Cricket;Sri Lanka;Yuva;ICC T20;INTERNATIONAL;Yevaru;IndianWed, 31 Jul 2024 09:24:00 GMTఇండియన్ క్రికెట్ లో ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు తక్కువ సమయంలోనే భారత జట్టులో చోటు దక్కించుకోవడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి ఆటగాళ్లపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ ఇక జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం  చేసుకుంటున్నారు ఎంతోమంది యంగ్ ప్లేయర్లు. భారత జట్టులోకి వస్తుంటే ఒక సీనియర్ ప్లేయర్ మాత్రం అటు టీమిండియాలో అడపాదడబా అవకాశాలను మాత్రమే దక్కించుకుంటున్నాడు.


 అతను ఎవరో కాదు సంజూ శాంసన్. ఇండియన్ క్రికెట్లో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ ఎవరు అంటే ముందుగా ఇతని పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిగతా యువ ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఇతను భారత జట్టులోకి అరంగేట్రం చేసి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేదు. అయితే ఇలా భారత జట్టులోకి వచ్చినప్పుడు ఒకటి రెండు మ్యాచ్లలో బాగా రాణించిన.. ఆ తర్వాత మాత్రం నిలకడలేమిటో ఇక జట్టులో చోటు కోల్పోతూ ఉంటాడు. అయితే ఇక ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా టి20 సిరీస్ కు ఎంపికైనప్పటికీ అతనికి మళ్ళీ అడపా దడప అవకాశాలే దక్కాయి.


 దీంతో సంజు విషయంలో సెలెక్టర్లు వివక్ష చూపిస్తున్నారు అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక కొన్ని గణాంకాలు చూపుతూ ఇలాంటి గణాంకాలు చూసి కూడా సంజుకి జట్టులో చోటు ఇవ్వడం కరెక్టేనంటారా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడిన సంజూ 19.30 సగటుతో 131.36 స్ట్రైక్ రేటుతో రెండు ఆప్ సెంచరీలు కలుపుకొని 444 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడాది నుంచి ఆడిన మ్యాచ్లలో 50 ప్లస్ పరుగులు చేసింది ఒకే ఒక్కసారి మాత్రమే. ఇక మిగతా మ్యాచ్లో 5, 12, 7, 13, 1, 40, 12 ఇలా పరుగులు చేస్తూ వచ్చాడు. ఇక ఇటీవలే అటు శ్రీలంకతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలో కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఉన్న పోటీ దృశ్యం ఇలాంటి గణాంకాలు ఉన్న సంజూకి ఎంతవరకు జట్టులో చోటుకల్పించడం బెటర్ అనే చర్చ కూడా జరుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>