EventsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/events/147/revanthreddy8a3d291b-4f2f-4cf6-b03e-463975046075-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/events/147/revanthreddy8a3d291b-4f2f-4cf6-b03e-463975046075-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో ప్రభుత్వం తరపున నంది అవార్డులు గతంలో ఎన్నో ఏళ్లుగా ఇచ్చారు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు గతంలో నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు కామెంట్స్ చేసారు, ప్రభుత్వాలతో కూడా మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు సినీ పరిశrevanthreddy{#}Jayanthi;vedhika;tuesday;Telangana;CM;Reddy;Revanth Reddy;Congress;Chiranjeevi;producer;Producer;Telugu;Tollywood;Cinema;Governmentఏపీ:తెలంగాణ సీఎంపై స్పందించిన మెగాస్టార్.!ఏపీ:తెలంగాణ సీఎంపై స్పందించిన మెగాస్టార్.!revanthreddy{#}Jayanthi;vedhika;tuesday;Telangana;CM;Reddy;Revanth Reddy;Congress;Chiranjeevi;producer;Producer;Telugu;Tollywood;Cinema;GovernmentWed, 31 Jul 2024 10:15:00 GMTసినీ పరిశ్రమలో ప్రభుత్వం తరపున నంది అవార్డులు గతంలో ఎన్నో ఏళ్లుగా ఇచ్చారు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు గతంలో నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు కామెంట్స్ చేసారు, ప్రభుత్వాలతో కూడా మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు సినీ పరిశ్రమను ముఖ్య‌మంత్రి కోరారు.నా అంతట నేను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేద'ని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉంటోందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నేను టాలీవుడ్ కి గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పాను. సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్నవారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని ఈ వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేశాను. కానీ ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.అంటూ చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తోపాటు పలువురు తాజాగా స్పందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి తన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ పోస్ట్ చేశారు. దీంతోపాటు గతంలో గద్దర్ అవార్డులకు తను మద్దతుగా మాట్లాడిన వీడియోని చిరంజీవి పంచుకున్నారు.కాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తో పాటుగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించామని.. రెండు మూడు సార్లు అపాయింట్‌మెంట్ కోసం కాల్ చేశామని అన్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్లి మాట్లాడటానికి రెడీగా ఉన్నామని అన్నారు. గద్దర్ గొప్ప వ్యక్తి.. ఆయన పేరుమీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు అని ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>