PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan3abed57e-79ef-4073-9934-6c6e929b1fef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan3abed57e-79ef-4073-9934-6c6e929b1fef-415x250-IndiaHerald.jpgగుస‌. ఎట్టి ప‌రిస్థితిలోనూ ష‌ర్మిల‌ను ఎదిరించేందుకు మొగ్గు చూపించాల‌ని.. లేక‌పోతే.. కుటుంబంలోనే క‌ల్లోలం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు స‌మాచారం. ఇంత చేసిన త‌ర్వాత‌.. ఇక , రాజీ ఏంట‌ని జ‌గ‌న్ అన్న‌ట్టుగా అత్యంత ys.jagan{#}Party;media;TDP;YCPరాజీనా.. పేచీనా.. ష‌ర్మిలతో జ‌గ‌న్ ఫైట్ ఎలా ?రాజీనా.. పేచీనా.. ష‌ర్మిలతో జ‌గ‌న్ ఫైట్ ఎలా ?ys.jagan{#}Party;media;TDP;YCPWed, 31 Jul 2024 16:25:00 GMTరాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు శ‌త్రువులుగా మారుతారో.. ఎవ‌రు ఎప్పుడు మిత్రులుగా మార‌తారో చెప్ప‌లేని సంక‌ట స్థితి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు సొంత గూటిలోనే శ‌త్రువును పెట్టుకున్న‌ట్టుగా ఉంది.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిస్థితి. ఆయ‌న ఈ విష‌యంలో రాజీ ప‌డాలో.. లేక పేచీని కొన‌సాగించాలో అర్ధం కాక ఇబ్బంది ప‌డుతున్నారట‌. ఇదే విష‌యం వైసీపీ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందు హ‌ఠాత్తుగా రంగంలోకి వ‌చ్చిన సోద‌రి ష‌ర్మిల‌.. టార్గెట్ చేయ‌ని అంశం లేదు. వివేకా హ‌త్య కేసును తెర‌మీదికి తెచ్చి..ఊరూ వాడా ప్ర‌చారం చేసి.. వైసీపీ అధికారంలోకి రాకుండా చేసింంది.


ఇక‌, అధికారం పోయింద‌ని అనుకుంటే.. ఇప్పుడు ఉన్న  సింప‌తీని కూడా పోయేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. రోజూ ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో చెవిలో జోరీగలా ష‌ర్మిల‌.. వైఎస్ జ‌గ‌న్‌కు కంటిపై నిద్ర లేకుండా చేస్తున్న మాట వాస్త‌వం. నిజానికి క‌ర‌డు గ‌ట్టిన ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీ కంటే ఘోరంగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం.. టీడీపీ అనుకూల మీడియా దీనిని ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డంతో జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్‌గా మారింది. టీడీపైనానా ఎదుర్కొన‌చ్చుకానీ.. ష‌ర్మిల‌ను మాత్రం ఎదుర్కొనే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో జ‌గ‌నే చెబుతున్నారంటే.. ఏ రేంజ్‌లో ష‌ర్మిల విరుచుకుప‌డుతున్నార‌నేది తెలుస్తోంది.


మ‌రి దీనికి ప్ర‌త్యామ్నాయం ఏంటి? అయితే.. రాజీ, లేక‌పోతే.. పేచీనే! ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్‌కు తీవ్ర‌మైన ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో తెలుస్తోంది. రాజీ ప‌డేందుకు స‌తీమ‌ణి భార‌తి స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేద‌ని వైసీపీలో ఓ వ‌ర్గం గుసుగుస‌. ఎట్టి ప‌రిస్థితిలోనూ ష‌ర్మిల‌ను ఎదిరించేందుకు మొగ్గు చూపించాల‌ని.. లేక‌పోతే.. కుటుంబంలోనే క‌ల్లోలం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు స‌మాచారం. ఇంత చేసిన త‌ర్వాత‌.. ఇక , రాజీ ఏంట‌ని జ‌గ‌న్ అన్న‌ట్టుగా అత్యంత విశ్వ‌స‌నీయ వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పోనీ.. పేచీ ప‌డ‌దామ‌న్నాకూడా.. ఇక్క‌డ కూడా జ‌గ‌న్ కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు.


పేచీ ప‌డి ష‌ర్మిల‌ను ఒక్క మాట అన్నా కూడా.. ``అదిగో మ‌హిళ‌న‌ని కూడా చూడ‌కుండా.. సొంత తోబుట్ట‌వ‌ని కూడా చూడ‌కుం డా.. నోటికి వ‌చ్చిన‌ట్టు పేలుతున్నారు`` అంటూ.. మ‌ళ్లీ క‌న్నీరు పెట్టుకున్నా.. కొంగు చాపినా.. ఆమెకు అధికార ప‌క్షం అండ‌గా ఉంటుంద‌నేది వైసీపీ మాట‌. ఇది కూడా నిజ‌మే. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీని ఏకేసిన ష‌ర్మిల‌.. వైసీపీ నుంచి చిన్న ఎదురు దాడి జ‌రిగితే.. వెంట‌నే దానిని సెంటిమెంటుతో కొట్టారు. అప్ప‌టి వ‌ర‌కు అన్న తిట్లు చేసిన విమ‌ర్శ‌లు పోయి.. సెంటిమెంటు ప్లే అయింది.  దీంతో అంద‌రూ జ‌గ‌న్‌దే త‌ప్ప‌ని.. ఆయ‌న సొంత చెల్లి అని కూడా చూడ‌కుండా వ్యాఖ్య‌లు చేశార‌ని, ఇక‌, రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌ను ఆయ‌న ఏం కాపాడ‌తాడ‌ని.. టీడీపీ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. ఇలానే మున్ముందుకూడా జ‌రిగే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న్న‌ది వైసీపీ అధినేత ఆవేద‌న‌. ఎలా చూసుకున్నా.. అటు రాజీ ప‌డ‌లేరు.. ఇటు పేచీ పెట్టుకోలేరు. ఇదీ సంగ‌తి!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>