Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs2fb320a7-742c-46c3-ba40-b1dd92e35b52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brs2fb320a7-742c-46c3-ba40-b1dd92e35b52-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలలో ఎప్పటికప్పుడు అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఇతర పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ రాజకీయం మొత్తం అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలందరూ కూడా అటు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ ఉండడం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్Brs{#}saritha;MLA;Yevaru;Car;Telangana;Congress;Assembly;Party;U Turn;Newsఇది ఊహించనిది.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం?ఇది ఊహించనిది.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం?Brs{#}saritha;MLA;Yevaru;Car;Telangana;Congress;Assembly;Party;U Turn;NewsTue, 30 Jul 2024 22:30:00 GMTతెలంగాణ రాజకీయాలలో ఎప్పటికప్పుడు అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఇతర పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ రాజకీయం మొత్తం అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా  మారిపోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలందరూ కూడా అటు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ ఉండడం జరుగుతూ వస్తోంది.


 ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని బిఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతున్నప్పటికీ.. అటు వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉండడంతో ఇక ఆ పార్టీ పతనం అయిపోతుంది అని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఇప్పటివరకు ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కారు దికి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా అధికార పార్టీలోకి వెళ్లబోతున్నారు అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఎవరు ఊహించని మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.


 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా కారు పార్టీ నుంచి గెలిచి ఇక అధికార కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారు. అధికార కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలో చేరారు  ఆయన ఎవరో కాదు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తిరిగి సొంతగూటికి చేరుకున్నారు ఆయన. బండ్ల యూటర్న్ వెనుక గద్వాల కాంగ్రెస్ నేతలతో పడకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది  సరిత తిరుపతయ్యకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తనకు కాంగ్రెస్లో ఇక పెద్దగా ప్రాధాన్యత దక్కదు అని భావించి మళ్లీ యూటర్న్ తీసుకుని కారు పార్టీలోకి వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు కావాలనే కెసిఆర్ బండ్లను కాంగ్రెస్ లోకి పంపించి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు అన్న చర్చ కూడా జరుగుతుంది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>