MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu99333039-c49a-4617-b963-92d1783eb91e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu99333039-c49a-4617-b963-92d1783eb91e-415x250-IndiaHerald.jpg25 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాజు కుమారుడు.. అప్పట్లో సూపర్ రికార్డ్? ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెజెండరీ టాప్ హీరో కృష్ణతో కలిసి దాదాపు తొమ్మిది చిత్రాలలో బాల నటుడి గా నటించారు.. 1990లో వచ్చిన బాలచంద్రుడు సినిమా తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మళ్లీ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే యమలీల కథను ఎస్వీ కృష్ణారెడ్డి కృష్ణకి వినిపించగా కృష్ణ కి కూడా నచ్చడంతో రెండేళ్లు ఆగమని చెప్పారట.. అయితే ఆలస్యం అవ్వడంతో అలీ హీరోగా ఆ మూవీ రావడం అది సూపర్ హిట్ కావడం అన్నMahesh Babu{#}paruchuri brothers;prithy;vyjayanthi;SV museum;100 days;Rajakumarudu;Raghavendra;mahesh babu;CM;Telangana Chief Minister;ali;Darsakudu;Blockbuster hit;Tollywood;Rajani kanth;Father;Director;Hero;krishna;Cinema25 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాజు కుమారుడు.. అప్పట్లో సూపర్ రికార్డ్?25 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాజు కుమారుడు.. అప్పట్లో సూపర్ రికార్డ్?Mahesh Babu{#}paruchuri brothers;prithy;vyjayanthi;SV museum;100 days;Rajakumarudu;Raghavendra;mahesh babu;CM;Telangana Chief Minister;ali;Darsakudu;Blockbuster hit;Tollywood;Rajani kanth;Father;Director;Hero;krishna;CinemaTue, 30 Jul 2024 18:29:00 GMTప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెజెండరీ టాప్ హీరో కృష్ణతో కలిసి దాదాపు తొమ్మిది చిత్రాలలో బాల నటుడి గా నటించారు.. 1990లో వచ్చిన బాలచంద్రుడు సినిమా తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మళ్లీ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే యమలీల కథను ఎస్వీ కృష్ణారెడ్డి కృష్ణకి వినిపించగా కృష్ణ కి కూడా నచ్చడంతో రెండేళ్లు ఆగమని చెప్పారట.. అయితే ఆలస్యం అవ్వడంతో అలీ హీరోగా ఆ మూవీ రావడం అది సూపర్ హిట్ కావడం అన్ని జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా వరుసగా కథలు వినడం మొదలుపెట్టారు సూపర్ స్టార్ కృష్ణ.. ఈ క్రమంలోని పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చింది.. సామాన్య కథను కూడా తన టేకింగ్ తో అద్భుతంగా మార్చగల దర్శకుడు రాఘవేందర్రావు తన మిత్రుడు కృష్ణకి కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందించారు.. దీంతో మహేష్ బాబు తొలి చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను కూడా తన మిత్రుడు రాఘవేంద్రరావుపై పెట్టారు కృష్ణ. అలాగే మహేష్ మొదటి చిత్రాన్ని నిర్మించే బాధ్యతను వైజయంతి మూవీస్ కి అప్పగించారు. కథకు కావలసిన రిచ్ నెస్ కోసం ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేసే సంస్థ వైజయంతి మూవీస్.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సినిమా ముహూర్త సన్నివేశానికి అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి క్లాప్ ఇవ్వడం విశేషం.78 ప్రింట్లతో 116 స్క్రీన్ లలో రాజకుమారుడు మూవీ విడుదలయ్యింది. 


ఫస్ట్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అయిన ఈ సినిమా నెమ్మదిగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయ్యి 100 రోజులు విజయవంతంగా ప్రదర్శనమైంది.. 44 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ అప్పట్లోనే ఏకంగా రూ.10 కోట్లు పైగా వసూలు చేసినట్టు చేసింది.కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా నంది అవార్డు లభించింది.. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఒకానొక సందర్భంలో దర్శకుడు రాఘవేంద్రరావు షేర్ చేసుకున్నారు.కృష్ణకు మిత్రుడైన రాఘవేంద్రరావును చిన్నప్పటి నుంచి మహేష్ బాబుకు మామయ్య అని పిలవడం అలవాటు.. సినిమా షూటింగ్లో కూడా అలాగే పిలిచేవారట. అయితే ఈ మూవీలో ప్రీతి జింతా తో ఒక సన్నివేశం ప్లాన్ చేశారు రాఘవేంద్ర రావు. ఒక కూల్డ్రింక్ బాటిల్ ని తీసుకొచ్చి అందులో ఒక స్ట్రా వేసి ప్రీతి జింతాకు ఇచ్చారు. ఆమె తాగిన తర్వాత అదే స్ట్రా తో మహేష్ కూడా తాగాలంటూ సన్నివేశాన్ని వివరించారు.. ఇది వినగానే” నేను చేయను మామయ్య.. కావాలంటే నువ్వే చేసుకో”..అంటూ అక్కడి నుంచి సరదాగా మహేష్ పారిపోయారట.ఇక ఈ విషయాన్ని చెబుతూ తెగ నవ్వే సారు రాఘవేంద్రరావు. ఏదేమైనా.హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 25 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ లాగానే టాప్ హీరో స్టార్ డం సొంతం చేసుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>