PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-ys-jagan-jagan-mohan-reddy-ycp8256ea1f-db3a-4402-8145-e055abdb8bd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-ys-jagan-jagan-mohan-reddy-ycp8256ea1f-db3a-4402-8145-e055abdb8bd0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అసలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు మూలన కూర్చోబెట్టారు. ఆ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఆ పార్టీ నేతలు ఎంత అహంకారంతో వ్యవహరించారో చూసాము. ఇప్పుడు వైసీపీకి అధికారం పోయింది.. అయినా ఆ పార్టీ నేతలకు అహంకారం ఎంత మాత్రం తగ్గలేదు అన్న చర్చలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వినిపిస్తున్నాయి. తాము పథకాలు ఇచ్చిన డబ్బులు ఇచ్ysrcp; ys jagan; jagan mohan reddy; ycp{#}Ishtam;Party;Jagan;CBN;YCP;Andhra Pradeshఅధికారం లేక‌పోయినా వైసీపీకి అదే అహంకార‌మా ?అధికారం లేక‌పోయినా వైసీపీకి అదే అహంకార‌మా ?ysrcp; ys jagan; jagan mohan reddy; ycp{#}Ishtam;Party;Jagan;CBN;YCP;Andhra PradeshTue, 30 Jul 2024 13:11:00 GMTఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అసలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు మూలన కూర్చోబెట్టారు. ఆ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఆ పార్టీ నేతలు ఎంత అహంకారంతో వ్యవహరించారో చూసాము. ఇప్పుడు వైసీపీకి అధికారం పోయింది.. అయినా ఆ పార్టీ నేతలకు అహంకారం ఎంత మాత్రం తగ్గలేదు అన్న చర్చలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వినిపిస్తున్నాయి.


తాము పథకాలు ఇచ్చిన డబ్బులు ఇచ్చినా చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి తమకు ఓట్లు వేయలేదని వైసీపీ ప్రజలను నిందిస్తోంది. చంద్రబాబు ఎక్కువ హామీలు ఇచ్చారని అందుకే ఓడించారని వైసీపీ నేతలు ఫిక్స్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వైసీపీ నేత తానే జగన్ అన్నట్టుగా ఫీలయ్యారు. తిరుమలలో అక్రమంగా క్యూలైన్లకు వచ్చి చిప్స్ అమ్ముకునే వ్యక్తి కూడా తన వెనక జగన్ ఉన్నాడని రుబాబు చేసేవాడు. ఇక చోటా మోటా నేతలు సంగతి వాళ్ళ రుబాబు చెప్పాల్సిన పనిలేదు. అందువల్లే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఓడిపోయినా కూడా జనాలు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కూడా.. ఇంకా వైసీపీ నేతల్లో అదే అహంకార ధోరణి కనిపిస్తోంది.


ఓడిపోయిన తర్వాత గుణపాఠం నేర్చుకుని సైలెంట్ అవ్వాలి కానీ అధికారం రుచిమరిగి ప్రజలను మోసం చేస్తూ దౌర్జన్యం చేసేందుకు అలవాటు పడిన వైసీపీ నేతలు ఇంకా దానిని మర్చిపోలేకపోతున్నారు. ఇక అధికారం పోయిన తర్వాత రాజకీయాలకు తగినట్టుగా మారాల్సిన జగన్ రెడ్డి తన అహంకారాన్ని మరింత పెట్టింపు చేసుకున్నారు.. ప్రజలు అసెంబ్లీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కనీసం స్పీకర్ ఎన్నికకు కూడా సాంప్రదాయంగా హాజరు కాలేదు.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని తేల్చేశారు. ఏది ఏమైనా ఇదే అహంకార ధోరణితో వెళితే వైసిపికి ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండే పరిస్థితి లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>