PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy9069d565-f1c8-453b-90ee-6963172b04b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy9069d565-f1c8-453b-90ee-6963172b04b6-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు... గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో... మొన్న శుక్రవారం రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో... ఆ రోజు నుంచి ఇప్పటివరకు బడ్జెట్ పై చర్చోప చర్చలు చేస్తోంది అసెంబ్లీ. revanth reddy{#}monday;Friday;history;Yevaru;tuesday;Government;revanth;Telangana Chief Minister;Revanth Reddy;Assembly;Congress;CM;Party;Telangana;Ministerతెలంగాణ అసెంబ్లీ: కేసీఆర్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రేవంత్‌ ?తెలంగాణ అసెంబ్లీ: కేసీఆర్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రేవంత్‌ ?revanth reddy{#}monday;Friday;history;Yevaru;tuesday;Government;revanth;Telangana Chief Minister;Revanth Reddy;Assembly;Congress;CM;Party;Telangana;MinisterTue, 30 Jul 2024 09:34:00 GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు... గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో... మొన్న శుక్రవారం రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో... ఆ రోజు నుంచి ఇప్పటివరకు బడ్జెట్ పై చర్చోప చర్చలు చేస్తోంది అసెంబ్లీ.


అంతేకాదు ఈ అసెంబ్లీ... సమావేశాలలో... గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య  పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కెసిఆర్ ప్రభుత్వం కారణంగానే తెలంగాణకు ఈ పరిస్థితి ఎదురు అయిందని... కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అటు 8 నెలల్లోనే తెలంగాణ ను కాంగ్రెస్ నాశనం చేసిందని గులాబీ పార్టీ చెబుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే రికార్డు సొంతం చేసుకున్నారు.

 

కల్వకుంట్ల చంద్రశేఖర రావు రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి. సోమవారం రోజున తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను  ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.... మంగళవారం ఉదయం 3: 30 గంటల ప్రాంతం వరకు కొనసాగాయి. నాలుగింటికి బ్రేక్ ఇచ్చారు. తెలంగాణ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి కావడం గమనార్హం.

 

కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల వరకు తెలంగాణ   రాష్ట్ర  అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మూడున్నర గంటల వరకు  తెలంగాణ  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగడం జరిగింది. ఈ తరుణంలోనే కెసిఆర్ రికార్డును రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారు. ఎక్కువసేపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి... చరిత్రలో నిలిచారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆ రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>