LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/asaamee8d4d4f-a0ec-4244-ab4c-0191a5f01228-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/asaamee8d4d4f-a0ec-4244-ab4c-0191a5f01228-415x250-IndiaHerald.jpgభారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అసోం ఒకటి. ఒకప్పుడు అంతర్గత తీవ్రవాదం, అసోం రైఫెల్స్, బోడో తీవ్రవాదులతో ఇబ్బంది పడిన రాష్ట్రం క్రమంగా వారితో చర్చలు, కాల్పుల విరమణలు జరపుతూ వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి ప్రభుత్వాలు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అంతర్గత సమస్యలు పెద్దగా లేవు. అయితే వరదలు మాత్రం ఆ రాష్ట్రాన్ని ముంచెత్తుతాయి. ఇక అసోంలో దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అహోం రాజులు 700 ఏళ్ల క్రితం అసోంను పాలించారు. వారి కాలంలో నిర్మించిన మట్టి సమాధులు ఇasaam{#}maanas;sampada;king;CMఅసోంలోని ఈ సమాధులు.. యునెస్కోను ఆకర్షించాయి? ప్రత్యేకతలేంటో తెలుసుకోండి?అసోంలోని ఈ సమాధులు.. యునెస్కోను ఆకర్షించాయి? ప్రత్యేకతలేంటో తెలుసుకోండి?asaam{#}maanas;sampada;king;CMTue, 30 Jul 2024 11:00:00 GMTభారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అసోం ఒకటి. ఒకప్పుడు అంతర్గత తీవ్రవాదం, అసోం రైఫెల్స్, బోడో తీవ్రవాదులతో ఇబ్బంది పడిన రాష్ట్రం క్రమంగా వారితో చర్చలు, కాల్పుల విరమణలు జరపుతూ వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి ప్రభుత్వాలు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అంతర్గత సమస్యలు పెద్దగా లేవు. అయితే వరదలు మాత్రం ఆ రాష్ట్రాన్ని ముంచెత్తుతాయి.


ఇక అసోంలో దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అహోం  రాజులు 700 ఏళ్ల క్రితం అసోంను పాలించారు. వారి కాలంలో నిర్మించిన మట్టి సమాధులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. ఇటీవలే వీటిని వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్రం యునెస్కోకు ప్రతిపాదించింది. 2023-24 సంవత్సరానికి గానూ ఈ సమాధులు లను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేరింది.


మొయిడమ్స్ అనేది పిరమిడ్ లాంటి ఆకృతిలో భూగర్భ నిల్వల కోసం నిర్మించిన మట్టి సమాధులు. అసోంను 600 ఏళ్లు పాలించిన తాయ్ –అహోం రాజవంశానికి చెందిన రాజులను ఖననం చేసేందుకు వీటిని నిర్మించారు. రెండంతస్తుల కలిగిన ఈ నిర్మాణంలోనే ప్రవేశించే మార్గం వంపు తిరిగి ఉంటుంది. ఖననం చేసిన వ్యక్తి వాడిన వస్తువులు, నగలు, ఆయుధాలు, దుస్తులు ఈ సమాధుల్లోనే ఉంచేవారు.


అయితే దాదాపు ఇలా 90 మంది రాజులు, రాణులు, ప్రభువులను మరణాంతరం మొయిడమ్స్ లో ఖననం చేశారు. మొయిడమ్ లు తప్పనిసరిగా మట్టి, ఇటుక లేదా రాళ్లతో చేసిన బోలుగా ఉండే ఖజానాలపై నిర్మించిన మట్టి దిబ్బలు. అష్ట భుజి కుహరం మధ్యలో ఒక మందిరం ఉంటుంది. ఈ మొయిడమ్ లను పురతాన చైనా రాజు సమాధులు, ఈజిప్టియన్ల ఫారోల పిరమిడ్లతో పోల్చారు.


అహోం రాజవంశ సమాధులకు యునెస్కో గుర్తింపు దక్కడంతో ఈశాన్యం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది. కాజిరంగా, మానస్ నేషనల్ పార్కుల తర్వాత అసోం మూడో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కిందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ పోస్టు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>