MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rp-patnayak7f34ecbe-e12d-4fca-9624-4672e1f04d5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rp-patnayak7f34ecbe-e12d-4fca-9624-4672e1f04d5c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఆర్ పి పట్నాయక్ ఒకరు. ఆర్ పి పట్నాయక్ తన కెరియర్ లో ఎక్కువ శాతం తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు సంగీతం అందించాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ హిట్స్ అయ్యాయి. అలాగే ఆ సినిమాలలో చాలా సూపర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా తేజ దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు సూపర్ సక్సెస్ కావడంలో ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్ర పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే మ్యూజికrp patnayak{#}r p patnayak;Posters;teja;Music;Interview;Success;Telugu;Directorనేను తెలుగు అలా నేర్చుకున్నాను.. ఆర్పి పట్నాయక్..!నేను తెలుగు అలా నేర్చుకున్నాను.. ఆర్పి పట్నాయక్..!rp patnayak{#}r p patnayak;Posters;teja;Music;Interview;Success;Telugu;DirectorTue, 30 Jul 2024 17:43:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఆర్ పి పట్నాయక్ ఒకరు. ఆర్ పి పట్నాయక్ తన కెరియర్ లో ఎక్కువ శాతం తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు సంగీతం అందించాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ హిట్స్ అయ్యాయి. అలాగే ఆ సినిమాలలో చాలా సూపర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా తేజ దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు సూపర్ సక్సెస్ కావడంలో ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్ర పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఆర్ పి పట్నాయక్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో కూడా నటించాడు. అలా నటుడిగా కూడా ఈయన పరవాలేదు అనే స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తాను తెలుగు ఎలా నేర్చుకున్నాను అనే విషయాల గురించి క్లియర్ గా తెలియజేశాడు. తాజాగా ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ ... నేను పుట్టి పెరిగిందంతా కూడా ఒడిశాలోనే కావడం వల్ల నా కెరీర్ తొలినాళ్లలో తెలుగుపై నాకు పట్టు తక్కువ ఉండేది.

ఆ సమయంలో నాకు బాగా గుర్తు తెలుగు సినిమా పోస్టర్లు చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. నేను ఒరియాలో చదువుకున్నా కూడా ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడేవారు. అలాగే ఇంట్లో తెలుగు పాటలే వినిపించేవి. నేనెప్పుడు కూడా పెద్దబాలశిక్ష చదవలేదు. పద్యాలు , గ్రంథాలు కూడా చదవలేదు. కానీ , వాటన్నిటి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నాలెడ్జి సీతారామశాస్త్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని ఆర్ పి పట్నాయక్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>