MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-poorna-sriya-reddy29b464f1-8c38-43b4-baed-71873a733ef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-poorna-sriya-reddy29b464f1-8c38-43b4-baed-71873a733ef6-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక పాత్ర ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఎంత సాహసానికైనా దిగాల్సి ఉంటుంది. అందులో కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి సాహసాలు చేయడంలో ఏమాత్రం వెనుకాడరనే చెప్పాలి. ముఖ్యంగా రిస్కును పట్టించుకోకుండా పాత్రకు 100% న్యాయం చేయాలని, సినిమా మంచి హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి నటీమణులు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరి హీరోయిన్లు సినిమాల కోసం ఏకంగా భారీ సాహసాలు చేశారు. మరి సెలబ్రిటీలు చేసిన ఆ సాహసాలేంటో ఇప్పుడు చూద్దాం. SAMANTHA, POORNA, SRIYA REDDY{#}poorna,simhaa,Shruti Haasan,Prasanth Neel,prashanth neel,Samantha,India,Heroine,Reddy,Cinemaసినిమాల కోసం అలాంటి సాహసాలు చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!సినిమాల కోసం అలాంటి సాహసాలు చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!SAMANTHA, POORNA, SRIYA REDDY{#}poorna,simhaa,Shruti Haasan,Prasanth Neel,prashanth neel,Samantha,India,Heroine,Reddy,CinemaTue, 30 Jul 2024 10:53:16 GMTసాధారణంగా ఒక పాత్ర ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఎంత సాహసానికైనా దిగాల్సి ఉంటుంది. అందులో కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి సాహసాలు చేయడంలో ఏమాత్రం వెనుకాడరనే చెప్పాలి. ముఖ్యంగా రిస్కును పట్టించుకోకుండా పాత్రకు 100% న్యాయం చేయాలని, సినిమా మంచి హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి నటీమణులు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరి హీరోయిన్లు సినిమాల కోసం ఏకంగా భారీ సాహసాలు చేశారు. మరి సెలబ్రిటీలు చేసిన ఆ సాహసాలేంటో ఇప్పుడు చూద్దాం.

శ్రియా రెడ్డి..

సలార్ గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శృతిహాసన్ , శ్రియా రెడ్డి , బాబి సింహ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో శ్రియా రెడ్డి రాధా రామ పాత్రలో నటించింది.  ముఖ్యంగా ఈ పాత్రలో ఆమె తన చెవులకు కడియాలు తొడుక్కొని అందరిని ఆశ్చర్యపరిచింది.

సమంత..

పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న సమంత రంగస్థలం సినిమాలో బర్రెలు కడిగే సీన్లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఒక డూప్ తో ఈ సీన్ చేద్దామని అనుకున్నారట డైరెక్టర్..  కానీ సమంత స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా బురదలోకి దిగి బర్రెలను తన సొంత చేతులతోనే కడిగింది.

పూర్ణ..

తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పూర్ణ కొడివీరన్ సినిమాలో గుండు కొట్టించుకుంది.  సాధారణంగా హీరోలే గుండు కొట్టించుకోవడానికి ఒప్పుకోరు..  విగ్గుతో అలాంటి సన్నివేశాలు చేస్తారు. కానీ పూర్ణ మాత్రం గుండు గీయించుకొని అందరికీ షాక్ ఇచ్చింది. కావాలంటే విగ్గు పెట్టుకొని ఆ సీన్ చేయవచ్చు అయితే  బలమైన పాత్ర కోసం ఆమె తన జుట్టు మొత్తాన్ని ధారపోసింది.

సప్తమి గౌడ..

బ్లాక్ బస్టర్ కాంతారా సినిమాలో సప్తమి గౌడ ఈ సినిమా కోసమే ముక్కుపుడక కుట్టించుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ పాత్ర కోసం నొప్పిని కూడా భరించింది ఈ ముద్దుగుమ్మ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>