PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyana-deputy-cm-pawan-kalyan-tdp-jenasena-chandrababu-cm-chandrababu-purandeswari-d03733f7-ee44-41db-8590-2e0dc27cac91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyana-deputy-cm-pawan-kalyan-tdp-jenasena-chandrababu-cm-chandrababu-purandeswari-d03733f7-ee44-41db-8590-2e0dc27cac91-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయి కూటమి పార్టీలు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవడంతో పార్టీ కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమిలోని టీడీపీకి 135 సీట్లు జనసేనకు 21 సీట్లు , రాగా.... బిజెపి 8 సీట్లను గెలుచుకుంది. దీంతో అన్ని పార్టీల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మూడు పార్టీల నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అంశంలో ఒక్కో పార్టీకి ఒక్కోరకం సమస్య ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా వేధింపులకు గురైన తమకే నామినేటెడ్ సీట్లలో పchandrababu{#}pithapuram;Kothapalli;Telugu Desam Party;Vishakapatnam;Janasena;Bharatiya Janata Party;paritala ravindra;News;Government;Party;TDPచంద్రబాబు కీలక ప్రకటన.. పదవుల పండగ షురూ?చంద్రబాబు కీలక ప్రకటన.. పదవుల పండగ షురూ?chandrababu{#}pithapuram;Kothapalli;Telugu Desam Party;Vishakapatnam;Janasena;Bharatiya Janata Party;paritala ravindra;News;Government;Party;TDPTue, 30 Jul 2024 08:23:00 GMT

ఏపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయి కూటమి పార్టీలు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవడంతో పార్టీ కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమిలోని టీడీపీకి 135 సీట్లు జనసేనకు 21 సీట్లు , రాగా.... బిజెపి 8 సీట్లను గెలుచుకుంది. దీంతో అన్ని పార్టీల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మూడు పార్టీల నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అంశంలో ఒక్కో పార్టీకి ఒక్కోరకం సమస్య ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా వేధింపులకు గురైన తమకే నామినేటెడ్ సీట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.


అయితే పార్టీ విస్తరణలో భాగంగా....కీలక నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరింది. బిజెపి నుంచి కూడా నామినేటెడ్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దీంతో మూడు పార్టీలు ఈ సమస్యపై డిస్కషన్ చేసి చేసాయని తెలుస్తోంది. ఎలాంటి అనిశ్షితి, అస్పష్టత లేకుండా ఒక ఫార్ములా ప్రకారం ఈ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ మేరకు పదవుల పంపకం జరగనుందట. దీంతో ఎవరికి ఏ పదవి వస్తుందో అనే సస్పెన్స్ మూడు పార్టీలలో నెలకొంది. అయితే ఈ విషయంలో ముందుగా పొత్తుల్లో భాగంగా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమిని లీడ్ చేస్తున్న  తెలుగుదేశం పార్టీ భావిస్తుందని సమాచారం.


సీట్లను వదులుకున్న 31 మందిలో మెజారిటీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి.... వారిని గౌరవించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొదటి దశలో వారికే ప్రాధాన్యం దక్కబోతోంది. ఈ వారంలోనే జాబితా రిలీజ్ కానుందట. అందులో విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి, పీల గోవింద్, పరిటాల శ్రీరామ్, కొత్తపల్లి సుబ్బారాయుడు, రామరాజు, పిఠాపురం వర్మ లాంటి పలువురు నేతలకు కేబినేట్ ర్యాంకుతో నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని.... నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. ముందుగా నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట. కూటమిలో పదవులపై కసరత్తు రావడంతో ఇక నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచినట్టే అనే చర్చ జరుగుతోంది.


ఏ పార్టీకి ఎన్ని పదవులో ....ముఖ్యమైన పదవులు ఎవరికి అని మూడు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ఏంటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కూటమిలో మూడు పార్టీల నేతలకు  అసంతృప్తి కలగకుండా పదవుల పంపిణీ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయట కూటమి పార్టీ నాయకత్వాలు. శాసనసభ్యులతో పాటు జనసేనకు ఇప్పటికే 13 పదవులు ఇస్తామని.... ఎన్నికలకు ముందే హామీ ఇచ్చింది. కాబట్టి ఆ మేరకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి కూడా సముచిత స్థాయిలోనే నామినేటెడ్ పదవుల పంపకం....మిగతా వాటిలో భాగస్వామ్యం కల్పించాలని ఆలోచిస్తుందట. అందువల్ల అన్ని పార్టీలు సంతృప్తి చెందేలా పదవుల పంపకం ఉండబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>