PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-congress-party7d6574da-1250-4c39-a59f-3d90e0d5653c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-congress-party7d6574da-1250-4c39-a59f-3d90e0d5653c-415x250-IndiaHerald.jpg ఎప్పుడు ఆసక్తికరంగా ఉండే చిరల రాజకీయాలు మరొకసారి ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజవర్గాలు దాదాపుగా వారు వన్ సైడ్ అన్నట్టుగా జరిగింది. అయితే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. బాపట్ల పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు వైసిపి టిడిపి మధ్య ముఖాముఖి పోటీ నడవగా.. చీరాలలో మాత్రం త్రిముక పోటీ జరిగింది. అదే టిడిపికి ప్లస్సు అయిందని భావిస్తున్నారు. లేకుంటే ఇక్కడ వైసిపి విజయకేతం ఎగరవేసేది. వైసిపి విజయ అవకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బతీశారని పలువురు విశ్లేAP;CONGRESS PARTY{#}KARANAM BALARAMA KRISHNA MURTHY;Prakasam;chirala;Karanam Venkatesh;Bapatla;Venkatesh;politics;Bharatiya Janata Party;Congress;MLA;TDP;Hanu Raghavapudi;YCPఏపీ: రాజకీయాలలో సీనియర్లు కాంగ్రెస్ కి కలిసివచ్చేనా..?ఏపీ: రాజకీయాలలో సీనియర్లు కాంగ్రెస్ కి కలిసివచ్చేనా..?AP;CONGRESS PARTY{#}KARANAM BALARAMA KRISHNA MURTHY;Prakasam;chirala;Karanam Venkatesh;Bapatla;Venkatesh;politics;Bharatiya Janata Party;Congress;MLA;TDP;Hanu Raghavapudi;YCPMon, 29 Jul 2024 09:52:00 GMT
ఎప్పుడు ఆసక్తికరంగా ఉండే చిరల రాజకీయాలు మరొకసారి ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజవర్గాలు దాదాపుగా వారు వన్ సైడ్ అన్నట్టుగా జరిగింది. అయితే చీరాలలో మాత్రం అందుకు  భిన్నంగా ఫలితాలు వచ్చాయి. బాపట్ల పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు వైసిపి టిడిపి మధ్య ముఖాముఖి పోటీ నడవగా.. చీరాలలో మాత్రం త్రిముక పోటీ జరిగింది. అదే టిడిపికి ప్లస్సు అయిందని భావిస్తున్నారు. లేకుంటే ఇక్కడ వైసిపి విజయకేతం ఎగరవేసేది. వైసిపి విజయ అవకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బతీశారని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.


తాను ముఖ్యం కాదని వైసీపీ అభ్యర్థిని ఓడించడమే ముఖ్యమని ఆమంచి రాజకీయాలు సాగాయ అనే విధంగా చర్చలు జరిగాయట. తన రాజకీయ శత్రువు అయిన కరణం గెలవకూడదని చీరాలలో రాజకీయం రసవత్తంగా నడిపించారట ఆ మంచి.. చీరాల నియోజవర్గం వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు.. ఇక్కడ పార్టీలకన్నా వర్గాలు వ్యక్తులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాంటి చీరాలలో  2009 నుంచి 2019 వరకు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమంచి కృష్ణమోహన్.. ఆ సమయంలో అన్నిట ఆయన మాటే చెల్లుబాటయ్యింది.



2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆమంచి.. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బాయ్ చెప్పి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. టిడిపి నుంచి బరిలో ఉన్న కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. కానీ వైసీపీ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ మంచి హవానే ఎక్కువగా నడిచింది.. అయితే అనూహ్యంగా టిడిపి కరణం బలరాం, కరుణం వెంకటేష్ వైసీపీలోకి చేరారు.. దీంతో చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి అన్నట్టుగా మారిపోయింది. దీంతో ఒకే చోట ఇద్దరిని ఉంచడం సరికాదని వైసిపి ఆమంచిని పరుచూరి కి పంపించింది.. చీరాల టికెట్ను కరణం వెంకటేష్ కు కాయం చేశారు. దీంతో ఆమంచి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి చేరారు. కానీ ఈసారి ఎన్నికలలో టిడిపి కాంగ్రెస్ బిజెపి పార్టీలుగా బరిలోకి దిగడంతో.. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏకంగా 42 వేల ఓట్లు చీల్చింది. లేకపోతే ఇక్కడ వైసిపి నే గెలిచేదట. ఆ మంచి పోటీ కనక లేకపోతే కచ్చితంగా గెలుపు వైసిపిదే అన్నట్లుగా అక్కడి నేతలు తెలియజేస్తున్నారు. చివరికి టిడిపి నుంచి గెలిచిన కొండయ్య యాదవ్ గెలిచారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>