HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsd5f6dbae-a068-4c91-b8eb-93148c044b5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsd5f6dbae-a068-4c91-b8eb-93148c044b5d-415x250-IndiaHerald.jpgపరగడుపున దీన్ని తింటే డాక్టర్తో పనే ఉండదు? మారెడు ఆకు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను చాలా సులభంగా పెంచుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని ఇస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. నోటిపూతతో బాధపడేవారు పరగడుపునే దీన్ని తింటే కచ్చితంగా చాలా ప్రయోజనం ఉంటుంది. మధుమేహ బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మారేడు ఆకు ఎంతో మేలHealth Tips{#}Potassium;Calcium;Hemoglobin;Heart;Ayurveda;Airపరగడుపున దీన్ని తింటే డాక్టర్తో పనే ఉండదు?పరగడుపున దీన్ని తింటే డాక్టర్తో పనే ఉండదు?Health Tips{#}Potassium;Calcium;Hemoglobin;Heart;Ayurveda;AirMon, 29 Jul 2024 19:37:00 GMT మారెడు ఆకు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను చాలా సులభంగా పెంచుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని ఇస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. నోటిపూతతో బాధపడేవారు పరగడుపునే దీన్ని తింటే కచ్చితంగా చాలా ప్రయోజనం ఉంటుంది. మధుమేహ బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మారేడు ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు ఇంకా అలాగే అలెర్జీలతో బాధపడేవారికి మారెడు దళం ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆకులలో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం ఇంకా ఇనుముతో కూడిన చాలా రకాల పోషకాలున్నాయి. ఇంకా అంతేగాక ఈ ఆకుకి శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. 


అందుకే వేసవి కాలంలో ప్రతిరోజూ పరగడుపునే మారేడు ఆకులు తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. దీన్ని రోజూ తీసుకుంటే గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని చెబుతున్నారు. మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నివారించే గుణం వుంది. ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకు పళ్ళ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయంటున్నారు. ఈ ఆకు సుగంధ భరితంగా ఉంటాయి. ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తాయని చెబుతున్నారు. మారేడు పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉంటాయి. కమ్మని వాసన కలిగి ఉంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>