Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-ktr920a3b67-657e-4daf-a65e-2f6b37f30089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-ktr920a3b67-657e-4daf-a65e-2f6b37f30089-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లాగానే అట రాజకీయాల్లో కూడా ఈ మధ్యకాలంలో వారసుల హవా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుల వారసులు ఎంతో మంది పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న వయసులోనే ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. అంతేకాదు మంత్రి పదవులు కూడా చేపడుతున్నారు. కొంతమంది అయితే చదువులను పక్కనపెట్టి మరీ రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం కొత్తరకం రాజకీయ నాయకుడు గురించి. ఆయన తండ్రి ఒక రాజకీయ ఉద్దండుడు. తన సKtr{#}University;KTR;Telangana Chief Minister;Manam;Minister;రాజీనామా;MLA;Father;MP;Party;Telangana;Cinema;zero;Heroహీరోలు.. జీరోలు : లక్షల జీతం వదిలేసొచ్చి.. తెలంగాణ హీరో అయ్యాడు?హీరోలు.. జీరోలు : లక్షల జీతం వదిలేసొచ్చి.. తెలంగాణ హీరో అయ్యాడు?Ktr{#}University;KTR;Telangana Chief Minister;Manam;Minister;రాజీనామా;MLA;Father;MP;Party;Telangana;Cinema;zero;HeroMon, 29 Jul 2024 08:32:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లాగానే అట రాజకీయాల్లో కూడా ఈ మధ్యకాలంలో వారసుల హవా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుల వారసులు ఎంతో మంది పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న వయసులోనే ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. అంతేకాదు మంత్రి పదవులు కూడా చేపడుతున్నారు.


 కొంతమంది అయితే చదువులను పక్కనపెట్టి మరీ రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం కొత్తరకం రాజకీయ నాయకుడు గురించి. ఆయన తండ్రి ఒక రాజకీయ ఉద్దండుడు. తన సొంత రాష్ట్రం కలను సహకారం చేయడానికి సొంత పార్టీని పెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొని ముందుకు సాగిన ధీరుడు. చివరికి అనుకున్నది సాధించి10 కోట్ల మంది ప్రజల సొంత రాష్ట్ర కలను నెరవేర్చిన వీరుడు. తండ్రి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయినప్పుడు ఇక కొడుకు మొదటి నుంచి రాజకీయాల్లో ఉండాలి. కానీ ఆయన అలా చేయలేదు. ముందు చదువును పూర్తి చేశారు. అంతేకాదుఒక పెద్ద కంపెనీలో మేనేజర్ గా కూడా పనిచేసారు.


 కానీ సొంత రాష్ట్రం కలను నెరవేర్చే క్రమంలో తండ్రి వెంటే ఉండాలని అర్థం చేసుకున్నారు. దీంతో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలేసి తండ్రివెంటే అడుగులు  వేశారు ఆయన. ఆయన ఎవరో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు. 1976 జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర రావు, శోభా దంపతులకు జన్మించారు కేటీఆర్ ఈయన అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్కులు ఎంబీఏ పూర్తి చేసి ఆ దేశం లోనే ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో 5 ఏళ్ళ పాటు మేనేజర్ గా పని చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగమయేందుకు తండ్రి వెంటే నడిచేందుకు లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి 2004 నుంచి పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు.


 అప్పటికే తండ్రి హీరో. రాజకీయాల్లో ఎన్నో పదవులను చేపట్టారు. కానీ కెసిఆర్ కొడుకు కేటీఆర్ మాత్రం ఇంకా జీరోనే. 2006 ఎంపీ ఉప ఎన్నిక, 2008 ఉప ఎన్నికలో తండ్రికి గెలుపులో కీలక పాత్ర వహించిన కేటీఆర్.. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి కొడుకు ఎంట్రీ ఎంతో సులభం అనుకున్నారు అందరూ. కానీ మొదటిసారి ఎన్నికల్లోనే గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టి.. తన వాగ్దాటితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచారు. అప్పటికి ఆయన హీరో కాలేదు. 2014 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఐటీ , మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది.


ఐటీ మినిస్టర్ అంటే ఇలాగే ఉండాలని అందరికీ అనిపించింది. ఈ క్రమంలోనే బెస్ట్ ఐటి మినిస్టర్ గా పేరు సంపాదించుకున్నారు ఆయన. అంతేకాదు ఇక తన వాగ్దాటితో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించే కేసిఆర్ కు సరైన వారసుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కేటీఆర్. ఇలా జీరో నుంచి హీరోగా మారిపోయారు ఆయన.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>