Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-509aad8f-ebd3-42bc-9a2d-1a7764415dd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-509aad8f-ebd3-42bc-9a2d-1a7764415dd5-415x250-IndiaHerald.jpg గౌతమ్ గంభీర్ హెడ్‍కోచ్‍గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సిరీస్‍లోనే భారత్ సత్తా చాటుకుంది. అవును, శ్రీలంక గడ్డ వేదికగా టీమిండియా తన ఉనికిని చాటుకుంది. రెండో టీ20లో కూడా ఆతిథ్య లంకను భారత్ చిత్తు చిత్తు కింద ఓడించి ఇంటికి పంపింది. వర్షం ప్రభావంతో టార్గెట్ కుదించినా కూడా రెండో టీ20లో టీమిండియా అలవోకగా విజయాన్ని చేజిక్కించుకుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‍ను 2-0తో పక్కా చేసుకుంది. భారత టీ20 రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యCricket {#}Hardik Pandya;Yashasvi Jaiswal;ravi anchor;bharath;Sri Bharath;Suryakumar Yadav;Sri Lanka;ICC T20;Varsham;Indiaటీ20 సిరీస్‍‍ భారత్ సొంతం... శ్రీలంకకి భంగపాటుటీ20 సిరీస్‍‍ భారత్ సొంతం... శ్రీలంకకి భంగపాటుCricket {#}Hardik Pandya;Yashasvi Jaiswal;ravi anchor;bharath;Sri Bharath;Suryakumar Yadav;Sri Lanka;ICC T20;Varsham;IndiaMon, 29 Jul 2024 21:59:00 GMT!

గౌతమ్ గంభీర్ హెడ్‍కోచ్‍గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సిరీస్‍లోనే భారత్ సత్తా చాటుకుంది. అవును, శ్రీలంక గడ్డ వేదికగా టీమిండియా తన ఉనికిని చాటుకుంది. రెండో టీ20లో కూడా ఆతిథ్య లంకను భారత్ చిత్తు చిత్తు కింద ఓడించి ఇంటికి పంపింది. వర్షం ప్రభావంతో టార్గెట్ కుదించినా కూడా రెండో టీ20లో టీమిండియా అలవోకగా విజయాన్ని చేజిక్కించుకుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‍ను 2-0తో పక్కా చేసుకుంది. భారత టీ20 రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన తరువాత వరుస విజయాలు భరత్ జట్టు కైవసం చేసుకుంటోంది. వర్షం వల్ల డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లకు 78 పరుగుల లక్ష్యం రాగా.. 6.3 ఓవర్లలోనే టీమిండియా సునాయాసంగా ఛేదించేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు గాను 161 పరుగులు చేసింది. అప్పటికే వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా సాగింది. టీమిండియా బరిలో దిగాక కూడా వాన పడింది. దీంతో సమయం చాలా వృథా అయింది. దాంతో టీమిండియా లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ విధానంలో 8 ఓవర్లకు 78 పరుగులుగా అంపైర్లు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో బరిలో దిగిన టీమిండియా 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాధగా, సంజూ శాంసన్ డక్ అవుట్ (0)తో తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే, యశస్వి మాత్రం లంక బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26 పరుగులు) తన మార్క్ విధ్వంకర ఇన్నింగ్స్ ఆడడంతో విన్నింగ్ చాలా తేలిక అయింది.

ఇకపోతే ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలో విరుచుకు పడినా అది నల్లేరు మీద నడకలాగే సాగింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది శ్రీలంక. కుషాల్ పెరీరా (34 బంతుల్లో 53 పరుగులు) అర్ధ శకతం సాధించగా పాతుమ్ నిస్సంక (32) పర్వాలేదనిపించాడు. అయితే, 3 వికెట్లకు 130 పరుగులతో ఉన్న దశ నుంచి.. చివరి ఐదు ఓవర్లలో కేవలం 31 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది లంక. దీంతో అత్తెసరు లక్ష్య ఛేదనను మాత్రమే టీంఇండియా ముందు ఉంచగలిగింది. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతో దుమ్ము లేపాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>