MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gunashekar6c02d2a5-779d-4481-9cf0-af1b850fc55e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gunashekar6c02d2a5-779d-4481-9cf0-af1b850fc55e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చూడాలని ఉంది సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత గుణశేఖర్ రెండవ సారి చిరంజీవి హీరోగా మృగరాజు అనే మూవీ ని రూపొందించాడు. అప్పటికే చిరంజీవి , గుణశేఖర్ కాంబోలో రూపొందిన చూడాలని ఉంది మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో మృగరాజు మూవీ పై అటు చిరు ఫ్యాన్స్ మరియు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాకgunashekar{#}Chiranjeevi;Bhumika Chawla;gunasekhar;Episode;Okkadu;Varsham;Mrugaraju;mahesh babu;Prakash Raj;king;Interview;Cinemaఒక్కడు మూవీ క్లైమాక్స్ కోసం మహేష్ అంతలా కష్టపడ్డాడు.. గుణశేఖర్..!ఒక్కడు మూవీ క్లైమాక్స్ కోసం మహేష్ అంతలా కష్టపడ్డాడు.. గుణశేఖర్..!gunashekar{#}Chiranjeevi;Bhumika Chawla;gunasekhar;Episode;Okkadu;Varsham;Mrugaraju;mahesh babu;Prakash Raj;king;Interview;CinemaMon, 29 Jul 2024 15:05:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చూడాలని ఉంది సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత గుణశేఖర్ రెండవ సారి చిరంజీవి హీరోగా మృగరాజు అనే మూవీ ని రూపొందించాడు. అప్పటికే చిరంజీవి , గుణశేఖర్ కాంబోలో రూపొందిన చూడాలని ఉంది మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో మృగరాజు మూవీ పై అటు చిరు ఫ్యాన్స్ మరియు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మృగరాజు ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ , మహేష్ బాబు హీరోగా భూమిక చావ్లా హీరోయిన్ గా ఒక్కడు అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా మహేష్ , భూమిక తో పాటు గుణశేఖర్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఒక్కడు సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల గురించి చెప్పుకొచ్చాడు.

తాజాగా గుణశేఖర్ మాట్లాడుతూ... ఒక్కడు మూవీ క్లైమాక్స్ ను చాలా అద్భుతంగా తీయాలి అనుకున్నాం. అందులో భాగంగా ఈ ఆ మూవీ క్లైమాక్స్ లో కబడ్డీ సన్నివేశాలతో పాటు మహేష్ , ప్రకాష్ రాజ్ ల మధ్య ఒక యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశాం. ఇక ఆ కబడ్డీ మ్యాచ్ మరియు యాక్షన్ సన్నివేశం అంతా రాత్రి పూట ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో మహేష్ , ప్రకాష్ రాజ్ మధ్య యాక్షన్ సన్నివేశం ప్రారంభం అయిన తర్వాత వర్షం కురుస్తోంది. ఇక ఒక వైపు చలి , మరో వైపు వర్షం కారణంగా మహేష్ , ప్రకాష్ రాజు ఇద్దరు కూడా వణుకుతూ ఆ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొన్నారు. అలా ఒక్కడు మూవీ క్లైమాక్స్ కోసం మహేష్ , ప్రకాష్ రాజ్ ఎంతగానో కష్టపడ్డారు అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా గుణశేఖర్ తెలియజేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>