PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ys-jagan-ysrcp-chandrababu-tdp-boda-ramachandra-yadav-mla3438f548-c982-44ac-bf1d-f744f6459c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ys-jagan-ysrcp-chandrababu-tdp-boda-ramachandra-yadav-mla3438f548-c982-44ac-bf1d-f744f6459c53-415x250-IndiaHerald.jpgఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల రోజులు దాటింది. ఈ క్ర‌మంలోనే కూట‌మి ప్ర‌భుత్వంలో కొంద‌రు నేత‌లు.. పోలీసులు దూకుడుగా ఉంటే త‌మ‌పై కూట‌మి ప్ర‌భుత్వంలో దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో మొద‌లు పెట్టి.. ఆ పార్టీ నాయ‌కులు అంద‌రూ గ‌గ్గోలు పెడుతున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి మ‌రీ నిర‌స‌న దీక్ష చేసి వ‌చ్చారు. అయితే బీవైసీ అధినేత రామ‌చంద్ర యాద‌వ్ పెట్టిన ఓ పోస్టులో మాత్రం కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ నాయ‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పారు. పైగా రామ‌చంద్ర యాద‌వycp; ys jagan; ysrcp; chandrababu; tdp; boda Ramachandra Yadav; mla{#}krishna;collector;local language;Punganur;Annamayya;Madanapalli;Delhi;police;TDP;CBN;media;Party;YCPవైసీపీపై చంద్ర‌బాబు ప్రేమ బ‌య‌ట ప‌డిందిగా...?వైసీపీపై చంద్ర‌బాబు ప్రేమ బ‌య‌ట ప‌డిందిగా...?ycp; ys jagan; ysrcp; chandrababu; tdp; boda Ramachandra Yadav; mla{#}krishna;collector;local language;Punganur;Annamayya;Madanapalli;Delhi;police;TDP;CBN;media;Party;YCPMon, 29 Jul 2024 12:25:13 GMTఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల రోజులు దాటింది. ఈ క్ర‌మంలోనే కూట‌మి ప్ర‌భుత్వంలో కొంద‌రు నేత‌లు.. పోలీసులు దూకుడుగా ఉంటే త‌మ‌పై కూట‌మి ప్ర‌భుత్వంలో దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో మొద‌లు పెట్టి.. ఆ పార్టీ నాయ‌కులు అంద‌రూ గ‌గ్గోలు పెడుతున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి మ‌రీ నిర‌స‌న దీక్ష చేసి వ‌చ్చారు. అయితే బీవైసీ అధినేత రామ‌చంద్ర యాద‌వ్ పెట్టిన ఓ పోస్టులో మాత్రం కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ నాయ‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పారు. పైగా రామ‌చంద్ర యాద‌వ్ పోస్టుకు టీడీపీ సోష‌ల్ మీడియా వింగ్ నుంచి ఫుల్ స‌పోర్ట్ వ‌స్తోంది.


ఒక్క‌సారి రామ‌చంద్ర యాద‌వ్ పెట్టిన పోస్టు ఇలా ఉంది...
పేరుకి కూటమి ప్రభుత్వం... పోలీసు వ్యవస్థ వైసీపీ కనుసన్నల్లో...
- 307 కేసులో నిందితుడుగా వున్నా వైసీపీ నుండి పోటీ చేసిన అభ్యర్థిని బెంగుళూరు ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకుని ఆంధ్ర పోలీసులకి అప్పజెబితే 41 నోటీసు ఇచ్చి పెళ్ళికొడుకుని సాగనంపినట్టు పంపారు...
- అంగళ్ళు అల్లర్లలో చంద్రబాబు గారితో పాటు ఆపార్టీ కి చెందిన వందలాది కార్యకర్తలపై అక్రమంగా 307 కేసులు పెట్టి జైలు పలు చేసిన అప్పటి అన్నమయ్య SP కి కృష్ణ జిల్లాకు SP గా పోస్టింగ్ ఇస్తే వైసీపీ మాజీ మంత్రిని కలిసి తన వైసీపీ విధేయతను చాటుకున్నాడు.
- పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెంచాగిరి చేసిన పోలీసు అధికారులని పలమనేరులో కీలక పోస్టింగ్స్ లో నియమించిన స్థానిక ఎమ్మెల్యే.


- మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడిని పెళ్ళికొడుకుని పంపినట్టు ఢిల్లీ కి సాగనంపింది స్థానిక పోలీసులు.
- ఇలా రాష్ట్రంలో అనేక సంఘటనలు చూస్తుంటే పోలీసు వ్యవస్థలో వైసీపీ పార్టీ కి వున్న పట్టు అర్ధమవుతోంది.
- ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తొందర్లోనే పెద్దిరెడ్డి కుటుంబానికి చెంచాగిరి చేసి వేలమందిపై అక్రమకేసులు పెట్టి వేధించిన రిషాంత్ రెడ్డి, అమ్మిరెడ్డి లాంటి అధికారులకు ప్రమోషన్ ఇచ్చి కీలకమైన పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం.


ఈ పోస్టింగ్ కు టీడీపీ సోష‌ల్ మీడియా కేడ‌ర్ నుంచి మెజార్టీ మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. మ‌రి కొంద‌రు మాత్రం చంద్ర‌బాబు టైం చూసుకుని ఆయ‌న చేయాల్సిన ప‌ని చేస్తారు.. కంగారు అవ‌స‌రం లేద‌ని మెసేజ్‌లు పెడుతున్నారు. ఏదేమైనా రామ‌చంద్ర పోస్టు అయితే టీడీపీ వ‌ర్గాల్లో కాక రేపింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>