MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఫ్యామిలీ డ్రామా పై ఆశలుపెట్టుకున్న అల్లరోడు ! టాలీవుడ్ ఇండస్ట్రీ మీడియం రేంజ్ హీరోలలో అల్లరి నరేష్ బాగా సీనియర్. రాజేంద్ర ప్రసాద్ తరువాత కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ఇతడి సినిమాలు గతంలో మినిమం గ్యారెంటీ మూవీలుగా నిర్మాతలకు బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టేవి. అయితే ప్రేక్షకుల అభిరుచి మారిపోయి హాస్య సినిమాలకు ‘జబర్దస్త్’ కామెడీకి తేడా తెలియని రోజులు వచ్చేయడంతో ఈ హీరో తన ప్రాభవాన్ని అంతా కోల్పోయాడు. ఆమధ్య వచ్చిన ‘నాంధి’ హిట్ అవ్వడంతో తిరిగి అతడి కెరియర్ ట్రాక్ లో పడుallari naresh{#}rajendra prasad;babu rajendra prasad;Thriller;allari naresh;Athadu;Darsakudu;Comedy;Heroine;Audience;Industry;Tollywood;Cinema;Hero;News;Directorఫ్యామిలీ డ్రామా పై ఆశలుపెట్టుకున్న అల్లరోడు !ఫ్యామిలీ డ్రామా పై ఆశలుపెట్టుకున్న అల్లరోడు !allari naresh{#}rajendra prasad;babu rajendra prasad;Thriller;allari naresh;Athadu;Darsakudu;Comedy;Heroine;Audience;Industry;Tollywood;Cinema;Hero;News;DirectorMon, 29 Jul 2024 10:00:00 GMTఫ్యామిలీ డ్రామా పై ఆశలుపెట్టుకున్న అల్లరోడు !



టాలీవుడ్ ఇండస్ట్రీ మీడియం రేంజ్ హీరోలలో అల్లరి నరేష్ బాగా సీనియర్. రాజేంద్ర ప్రసాద్ తరువాత కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ఇతడి సినిమాలు గతంలో మినిమం గ్యారెంటీ మూవీలుగా నిర్మాతలకు బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టేవి. అయితే ప్రేక్షకుల అభిరుచి మారిపోయి హాస్య సినిమాలకు ‘జబర్దస్త్’ కామెడీకి తేడా తెలియని రోజులు వచ్చేయడంతో ఈ హీరో తన ప్రాభవాన్ని అంతా కోల్పోయాడు.



ఆమధ్య వచ్చిన ‘నాంధి’ హిట్ అవ్వడంతో తిరిగి అతడి కెరియర్ ట్రాక్ లో పడుతుంది అని అంతా భావించారు. అయితే ఆతరువాత వచ్చిన ‘ఉగ్రం’ ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ ‘ఆ ఒక్కటి అడక్కు’ వరసగా ఫ్లాప్ కావడంతో తిరిగి అతడి ఫ్లాప్ ల పరంపర కొనసాగుతోంది. లేటెస్ట్ గా అతడు ‘బచ్చల మల్లి’ అన్న మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ పై కూడ పెద్దగా అంచనాలు లేవు.



ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా అతడు మొదలుపెట్టిన ఒక మూవీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో ‘ఫ్యామిలీ డ్రామా’ అనే థ్రిల్లర్ మూవీ లేటెస్ట్ గా ప్రారంభం అయింది. మెహర్ తేజ్ అనే ఒక కొత్త దర్శకుడు ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.



రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఒక డిఫరెంట్ కథ అన్న వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో థ్రిల్లర్ మూవీలను ఆమూవీ స్క్రీన్ ప్లే బాగుంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీనితో ఈ లేటెస్ట్ ట్రెండ్ తనకు అదృష్టాన్ని కలిగిస్తుందని అల్లరోడు భావిస్తున్నాడు. దీనికితోడు ఈమూవీని నిర్మిస్తున్నది ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కాబట్టి బడ్జెట్ విషయంలో అదేవిధంగా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడరని అల్లరి నరేష్ అంచనా. ఈమధ్య కాలంలో అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని సినిమాలను హీరోల ఇమేజ్ తో సంబంధం లేకుండా పరక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే..











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>