Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillywoid39967e96-b05e-484f-aba1-6ba5e9b7f367-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillywoid39967e96-b05e-484f-aba1-6ba5e9b7f367-415x250-IndiaHerald.jpgపిల్లని వెతకమని చెబుతున్న మెగా మేనల్లుడు.. ఇంకా కాలేదట? మెగా మేనల్లుడు నటుడు సాయి దుర్గా తేజ్‌ గురించి తెలియని వారు ఉండరు. అదేనండి మన సాయి ధర్మ తేజ్. ఇప్పుడు ఐడియా వచ్చిందా? గ్రహాల అనుకూలించడం లేదనే నెపంతో ఆయన తన స్క్రీన్ నేముని సాయి దుర్గా తేజ్‌ అని మార్చుకున్నట్టున్నారు? అయితే ఈ పేరు ఇంకా జనాల్లో రిజిస్టర్ కాలేదు. అందుకే పాత పేరుని ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక విషయంలోకి వెళితే... తన పెళ్లంటూ వచ్చిన రూమర్స్‌పై సాయి తేజ్ చాలా ఆసక్తి కరంగా స్పందించారు. ‘ఉషా పరిణయం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కుTillywoid{#}dharma;Idea;Ala Ela;Yevaru;Girl;marriage;Cinemaపిల్లని వెతకమని చెబుతున్న మెగా మేనల్లుడు.. ఇంకా కాలేదట?పిల్లని వెతకమని చెబుతున్న మెగా మేనల్లుడు.. ఇంకా కాలేదట?Tillywoid{#}dharma;Idea;Ala Ela;Yevaru;Girl;marriage;CinemaMon, 29 Jul 2024 22:30:00 GMT

మెగా మేనల్లుడు నటుడు సాయి దుర్గా తేజ్‌ గురించి తెలియని వారు ఉండరు. అదేనండి మన సాయి ధర్మ తేజ్. ఇప్పుడు ఐడియా వచ్చిందా? గ్రహాల అనుకూలించడం లేదనే నెపంతో ఆయన తన స్క్రీన్ నేముని సాయి దుర్గా తేజ్‌ అని మార్చుకున్నట్టున్నారు? అయితే ఈ పేరు ఇంకా జనాల్లో రిజిస్టర్ కాలేదు. అందుకే పాత పేరుని ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక విషయంలోకి వెళితే... తన పెళ్లంటూ వచ్చిన రూమర్స్‌పై సాయి తేజ్ చాలా ఆసక్తి కరంగా స్పందించారు. ‘ఉషా పరిణయం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయనని యాంకర్‌ ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని ప్రశ్నించగా సదరు సమాధానం ఇవ్వడం జరిగింది.

దానికి ఆయన బదులు చెబుతూ.‘‘వన్‌సైడ్‌ లవ్‌ ఆల్రెడీ ఉంది. అటు నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. వీలైతే ఒక మంచిని వెతికి పెట్టండి.. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనే సమాధానం వినాల్సి వస్తోంది. దాంతో... నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామని చెబుతున్నారు. అందుకే.. నాకు మీరే పిల్లని చూడండి.. ఒకవేళ నాకు పెళ్లి అయినట్లయితే ఆ పిల్ల ఎవరు కాస్త చెప్పండి.. ఆమె నాకు కూడా కనబడాలి కదా.. ఎంతైనా తాళికట్టినోడిని.. వదిలేసి అలా ఎలా తిరుగుతుంది చెప్పండి?’’ అని నవ్వుతూ రిప్లయ్‌ ఇచ్చారు.

దాంతో ఈ ఫన్నీ సమాధానానికి సదరు యాంకర్ చాలా గట్టిగా నవ్వడం జరిగింది. ఇకపోతే ఇదే వేదికపై పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై ప్రశ్నించగా... సాయి తేజ్‌ నవ్వుతూ, ‘‘బాల్యంలో నేను ఓ టోర్నమెంట్‌ కి వెళ్లి అందులో ఓడిపోవడం జరిగింది. దాంతో చాలా బాధపడుతూ ఇంటికొచ్చా. ఆ బాధలో నేనుంటే.. ‘ఒక్కసారే కాదురా నువ్వు 10 సార్లు ఓడినా ఫర్వాలేదు. కానీ, ఆట బాగా ఆడాలి!’ అని మామయ్య ఆనాడు చెప్పుకొచ్చారు. ఆయన ప్రోత్సాహంతో తర్వాత విన్‌ అయ్యా. నేను గెలిచిన రోజు ఆయన ఎలా ఆనందించారో.. ఆయన గెలుపును నేను అలా ఎంజాయ్‌ చేశా’’ అని చెప్పుకొచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>