Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8baae481-e3f1-4401-8306-4ab06e74e3d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8baae481-e3f1-4401-8306-4ab06e74e3d2-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మూడేళ్ల క్రితం ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి చెబుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “యథాకాలమ్.. తథా వ్యవహారమ్” అని రాసి ఓవైపు హైదరాబాద్ సిటీని, మరోవైపు తుపాకీ గురిపెట్టినట్టు ఆ పోస్టర్ లో చూపిస్తూ ఆసక్తిని క్రియేట్ చేశారు. అయితే ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్టుకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్.. జనసేన గెలుపు, డిప్యూటీ సీఎం అవ్వడంతో ప్రస్తుతం ఏsocialstars lifestyle{#}Pooja Hegde;kalyan;surender reddy;Hyderabad;Deputy Chief Minister;Viswak sen;Janasena;ram talluri;Posters;ram pothineni;shankar;Director;Reddy;Cinemaఆ దర్శకుడితో పవన్ సినిమా.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..!!ఆ దర్శకుడితో పవన్ సినిమా.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..!!socialstars lifestyle{#}Pooja Hegde;kalyan;surender reddy;Hyderabad;Deputy Chief Minister;Viswak sen;Janasena;ram talluri;Posters;ram pothineni;shankar;Director;Reddy;CinemaMon, 29 Jul 2024 14:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మూడేళ్ల క్రితం ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి చెబుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “యథాకాలమ్.. తథా వ్యవహారమ్” అని రాసి ఓవైపు హైదరాబాద్ సిటీని, మరోవైపు తుపాకీ గురిపెట్టినట్టు ఆ పోస్టర్ లో చూపిస్తూ ఆసక్తిని క్రియేట్ చేశారు. అయితే ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్టుకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్.. జనసేన గెలుపు, డిప్యూటీ సీఎం అవ్వడంతో ప్రస్తుతం ఏపీలో బిజీగా ఉన్నారు. పవన్ చేతిలో ఎన్నికల ముందు ఒప్పుకున్న సినిమాలు రాజకీయాల బిజీ వల్ల పూర్తి కాలేదు. పవన్ కూడా గతంలో వీలు చూసుకొని ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేస్తానని తెలిపాడు. కానీ వాటికి సమయం పట్టేలా ఉంది. అయితే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. OG, హరిహర వీరమల్లు షూటింగ్ కి డేట్స్ ఇస్తే అయిపోతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఆ సినిమా ఉంటుందో ఉండదో ఎవ్వరికి క్లారిటీ లేదు.అయితే వీటికంటే ముందు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాని ప్రకటించారు. అసలు అందరూ ఆ సినిమాని మర్చిపోయారు కూడా. ఆల్మోస్ట్ ఆ సినిమా ఉండదు అని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. విశ్వక్ సేన్ నటించిన “మెకానిక్ రాకీ” గ్లిమ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రామ్ ని కొందరు పవన్ ప్రాజెక్టుపై స్పందించాల్సిందిగా కోరారు.ఈ ప్రాజెక్టుపై రామ్ మాట్లాడుతూ..” ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మా వైపు వర్క్ మొత్తం పూర్తయింది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశాం. పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక అంతా ఆయన చేతుల్లోనే ఉంది. వారం క్రితమే ఆయనను కలిశాం. వీలు చూసుకుని సినిమాలు చెయ్యొచ్చు” అని అన్నారు.ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఆయన ముందుగా ఏ చిత్రానికి ప్రాధాన్యత ఇస్తారో అనేది ఉత్కంఠగా ఉంది.హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓజీ, హరిహర వీరమల్లు తర్వాతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డితో పవన్ సినిమా చేస్తారా లేదా అనే విషయం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>