PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ponnam-prabhakar-karimnagar-husnabad-congress-telangana7a5192a8-6dc6-4579-8974-555beeb91912-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ponnam-prabhakar-karimnagar-husnabad-congress-telangana7a5192a8-6dc6-4579-8974-555beeb91912-415x250-IndiaHerald.jpg తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ ఒక కీలకమైన మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ నేతగా ఎంతో గుర్తింపు పొందుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1967 మే 8న జన్మించిన పొన్నం ప్రభాకర్ చదువుకునే సమయం నుంచే రాజకీయాలపై అవగాహన పPONNAM PRABHAKAR;KARIMNAGAR;HUSNABAD;CONGRESS;TELANGANA{#}Department of transportation;Ponnam Prabhakar Goud;Lagadapati Rajagopal;Prasthanam;september;Backward Classes;December;Karimnagar;Telangana Chief Minister;Parliment;Minister;రాజీనామా;MLA;Reddy;CM;Telangana;Parliament;Hanu Raghavapudi;Congressఉద్యమాల వీరుడు పొన్నం ప్రభాకరుడు..!ఉద్యమాల వీరుడు పొన్నం ప్రభాకరుడు..!PONNAM PRABHAKAR;KARIMNAGAR;HUSNABAD;CONGRESS;TELANGANA{#}Department of transportation;Ponnam Prabhakar Goud;Lagadapati Rajagopal;Prasthanam;september;Backward Classes;December;Karimnagar;Telangana Chief Minister;Parliment;Minister;రాజీనామా;MLA;Reddy;CM;Telangana;Parliament;Hanu Raghavapudi;CongressMon, 29 Jul 2024 08:33:00 GMT-కార్యకర్త నుంచి రాష్ట్ర మంత్రి వరకు..!

-తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర.

- కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నేతగా అద్భుత గుర్తింపు.


 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  మూడవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ ఒక కీలకమైన మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ నేతగా ఎంతో గుర్తింపు పొందుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 రాజకీయ ప్రస్థానం:
1967 మే 8న జన్మించిన పొన్నం ప్రభాకర్  చదువుకునే సమయం నుంచే రాజకీయాలపై అవగాహన పెంచుకున్నాడు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోని ఎన్ఎస్ యూఐలో పనిచేసి  కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు.  ఆయన సేవలను గుర్తించినటువంటి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆయనకు కరీంనగర్ పార్లమెంటు సీటు  కేటాయించడంతో 2009  వరకు ఎంపీగా చేశారు. అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యుడుగా గెలిచిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఆ విధంగా పొన్నం ప్రభాకర్  తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత  పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా చేసి  అదే సమయంలో లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి కూడా గురయ్యారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 


మళ్లీ 2018 జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి  ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. 2018 సెప్టెంబర్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులై  2019 జూన్ 28న ఆ పదవికి కూడా రాజీనామా చేశాడు. ఆ తర్వాత 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా నియమితులయ్యాడు. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అద్భుత మెజారిటీతో గెలుపొందారు. బీసీల నుంచి గెలుపొందిన సీనియర్ నేతగా పొన్నం ప్రభాకర్  పేరు ఉండడంతో ఆయనను బీసీ సంక్షేమ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు.  ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>