LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style-latest-news-important-messege-social-media-articleec32e5a8-1109-4ee4-852b-738ec33b5981-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style-latest-news-important-messege-social-media-articleec32e5a8-1109-4ee4-852b-738ec33b5981-415x250-IndiaHerald.jpgఈ స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం తప్పని సరి అయింది. ఎందుకంటే ఇపుడు దాదాపుగా అందరూ... పల్లె, పట్టణం అంటే తేడా లేకుండా తినే తిండి నుండి, కట్టుకొనే గుడ్డ వరకు చేసిన లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. శ్రమ, సమయం, డబ్బు అదా అవడంతో ఇపుడు 90 శాతం మంది ఆన్లైన్ కొనుగోలుపైనే ఆధార పడుతున్న పరిస్థితి. ఇక యువత అయితే చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు చిరాగ్గా ఉన్నా, టైం పాస్ కావడం లేదు అనిపించినా వెంటనే ఏ సినిమా హాలుకో వెళ్లివారు. కానీ ఇపుడు పరిస్థితి మారింది.. ఇపుడు జనాలకి సోషల్life style latest news important messege social media article{#}Smart phone;Cheque;Husband;Wife;media;School;Cinemaస్మార్ట్ కాపురాలు కుప్పకూలుతున్నాయి... పెరిగిన విడాకుల గ్రాఫ్!స్మార్ట్ కాపురాలు కుప్పకూలుతున్నాయి... పెరిగిన విడాకుల గ్రాఫ్!life style latest news important messege social media article{#}Smart phone;Cheque;Husband;Wife;media;School;CinemaMon, 29 Jul 2024 10:59:00 GMTఈ స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం తప్పని సరి అయింది. ఎందుకంటే ఇపుడు దాదాపుగా అందరూ... పల్లె, పట్టణం అంటే తేడా లేకుండా తినే తిండి నుండి, కట్టుకొనే గుడ్డ వరకు చేసిన లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. శ్రమ, సమయం, డబ్బు అదా అవడంతో ఇపుడు 90 శాతం మంది ఆన్లైన్ కొనుగోలుపైనే ఆధార పడుతున్న పరిస్థితి. ఇక యువత అయితే చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు చిరాగ్గా ఉన్నా, టైం పాస్ కావడం లేదు అనిపించినా వెంటనే ఏ సినిమా హాలుకో వెళ్లివారు. కానీ ఇపుడు పరిస్థితి మారింది.. ఇపుడు జనాలకి సోషల్ మీడియా ఆ దాహాన్ని తీర్చేస్తుంది. ఎంతలా అంటే... సెకెనుకి ఒక రీల్ చూసేంత! అదే సోషల్ మీడియా నేడు కాపురాల్లో కూడా చిచ్చు పెడుతుంది అంటే మీరు నమ్ముతారా?

అవును, మీరు విన్నది నిజమే. అయితే సోషల్ మీడియా వలన లాభాలు లేవా? అంటే అనేకం ఉన్నాయి. అయితే నేటి తరం ఏది మంచిది, ఏది చెడ్డది అని తెలుసుకొనే పరిస్థితిలో లేకపోవడం దురదృష్టకరం. సోషల్ మీడియా తగాదాల వలన ప్రపంచం వ్యాపంగా ఏటా లక్షల సంఖ్యలో జంటలు విడిపోతున్నారు అనే విషయం మీకు తెలుసా? నేటి యువత ఎక్కువ సాయం సోషల్ మీడియాలోనే కాపురాలు పెట్టేస్తున్నారు. భర్త తిట్టాడని భార్య సోషల్ మీడియా ఫ్రెండ్స్ తో పంచుకుంటుంది. ప్రియురాలు వదిలేసిందని ఒకడు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల ముందు నంగనాచిలా కంటింగ్ కొడతాడు. తెల్లిదండ్రులు తిడుతున్నారని కొందరు పిల్లలు, స్నేహితులు మోసం చేసారని కొందరు... ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పర్సనల్ విషయాలు ఇపుడు పబ్లిక్ గా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు. కట్ చేస్తే.. విషయం మరింత తీవ్రతరం అయ్యి ప్రాణాలు పోయే దాకా వెళుతున్నాయి.

ఇంతకీ లోపం ఎక్కడుంది? సోషల్ మీడియా మీద తోసేద్దామా అంటే.. అవి మంచికోసమే పుట్టుకొచ్చాయి. అయితే కాలక్రమేణా జనాలు వాటిని మిస్ యూస్ చేస్తున్నారు అనేది నగ్న సత్యం. ఇక్కడ 90 శాతం మంది ఆ సో కాల్డ్ సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ మెయిన్ పర్పస్ పరిచిపోయి మరీ ప్రవర్తిస్తుంటారు. అందుకే ఇలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి.  

సోషల్ మీడియా రాకతోనే దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో చాలా తేలికగా కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. అదేవిధంగా పాత స్నేహితులు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా సోషల్ మీడియా మనకి ఉపకరిస్తుంది. ఇక మైనస్ అంటే... మనిషి విపరీత ప్రవర్తన వలన సోషల్ మీడియా వేదిక దుర్వినియోగం అనేది జరుగుతుంది అనేది నిర్వివాదాంశం. అపరిచిత వ్యక్తులతో పరిచయం పెట్టుకొనే తప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. లేనిపోని ఆఫర్లు కంటికి కనబడ్డప్పుడు చెక్ చేసుకొని మరీ సేల్ చేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. సోషల్ మీడియా వాడకూడదనికాదు.. కానీ దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వినియోగించడం మంచింది!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>