MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raj-tharuna559c8bb-aca8-48d9-9dd4-99a0a7f37310-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raj-tharuna559c8bb-aca8-48d9-9dd4-99a0a7f37310-415x250-IndiaHerald.jpgరాజ్ తరుణ్కి కూడా స్టార్ ట్యాగా? జోవియల్ స్టార్ ఏంట్రా? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్? సాధారణంగా మన స్టార్ హీరోలందరికీ కూడా పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. అయితే ఇది క్రేజ్ ఉన్న హీరోలకి మాత్రమే ఉంటుంది. కానీ ఇటీవల మిడిల్ రేంజ్ హీరోలు, చిన్న హీరోలు కూడా ఈ టైటిల్ ట్యాగ్స్ తెగ వేసుకుంటున్నారు.గతంలో క్రేజ్ ఉన్న స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరోకి పేరు ముందు ఇలా వేస్తున్నారు.ఇలా ఇటీవల శర్వానంద్ కూడా ఛార్మింగ్ స్టార్ అని పెట్టుకున్నాడు. ఇక సుధీర్ బాబు అయితే నవ దళపతి అనే ట్యాగ్Raj Tharun{#}sudheer babu;Dalapathi;Kumari 21 F;Raj Tarun;Tarun Kumar;netizens;vegetable market;Joseph Vijay;News;Hero;Cinemaరాజ్ తరుణ్కి కూడా స్టార్ ట్యాగా? జోవియల్ స్టార్ ఏంట్రా? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?రాజ్ తరుణ్కి కూడా స్టార్ ట్యాగా? జోవియల్ స్టార్ ఏంట్రా? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?Raj Tharun{#}sudheer babu;Dalapathi;Kumari 21 F;Raj Tarun;Tarun Kumar;netizens;vegetable market;Joseph Vijay;News;Hero;CinemaSun, 28 Jul 2024 13:35:23 GMTసాధారణంగా మన స్టార్ హీరోలందరికీ కూడా పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. అయితే ఇది క్రేజ్ ఉన్న హీరోలకి మాత్రమే ఉంటుంది. కానీ ఇటీవల మిడిల్ రేంజ్ హీరోలు, చిన్న హీరోలు కూడా ఈ టైటిల్ ట్యాగ్స్ తెగ వేసుకుంటున్నారు.గతంలో క్రేజ్ ఉన్న స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరోకి పేరు ముందు ఇలా వేస్తున్నారు.ఇలా ఇటీవల శర్వానంద్ కూడా ఛార్మింగ్ స్టార్ అని పెట్టుకున్నాడు. ఇక సుధీర్ బాబు అయితే నవ దళపతి అనే ట్యాగ్ పెట్టుకున్నాడు. తాజాగా మరో చిన్న హీరో రాజ్ తరుణ్ కూడా టైటిల్ ట్యాగ్ పెట్టుకోవడం గమనార్హం. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా మొన్న రిలీజయింది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ షాట్ లో రాజ్ తరుణ్ పేరుకు ముందు 'జోవియల్ స్టార్' అని ట్యాగ్ వేశారు.దీంతో ఈ సినిమా చూసిన వాళ్ళు అంతా కూడా తెగ ఆశ్చర్యపోతున్నారు. వరుస ప్లాపులతో అసలు ఏమాత్రం క్రేజ్ లేని హీరోలు కనీసం 20 కోట్ల మార్కెట్ కూడా లేకుండా ఇలా ట్యాగ్స్ వేసుకోవడం ఏంట్రా అని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. 


పైగా అసలు ఏమాత్రం క్రేజ్ లేని రాజ్ తరుణ్ ఇలా టైటిల్ వేసుకోవడం ఒక ఎత్తైతే జోవియల్ స్టార్ అని పెట్టుకోవడం మరో విశేషం. అయితే ఈ టైటిల్ రాజ్ తరుణ్ పెట్టుకోకపోయినా కానీ ఆ సినిమా టీమ్ పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంతో రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సినిమా రిలీజవ్వడమే గొప్ప అంటే మళ్ళీ తన పేరు ముందు ఏకంగా జోవియల్ స్టార్ అని పెట్టుకోవడంతో నెట్టింటా చర్చగా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు చేస్తుంటే, ఇంకొంతమంది ఇంతకంటే మంచి ట్యాగ్ దొరకలేదా జోవియల్ స్టార్ ఏంట్రా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజ్ తరుణ్ 2013 లో ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో హిట్టు కొట్టిన రాజ్ తరుణ్ ఆ వెంటనే సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ తో కూడా హిట్లు కొట్టాడు. ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తరువాత నుంచి ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా కొట్టలేదు.
" style="height: 812px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>