PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbn4c3010a7-d7ae-4fa3-9bd6-30062040291b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbn4c3010a7-d7ae-4fa3-9bd6-30062040291b-415x250-IndiaHerald.jpgసాధారణ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్లు, శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లు, గరీభ్ రథ్ ట్రైన్స్, ఇలా ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వందే భారత్ రైళ్లు వచ్చేశాయ్. ఇకపై వందే భారత్ స్లీపర్స్ ట్రైన్స్ రానున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ గా పేరు గాంచిన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టును శర వేగంగా పూర్తి చేస్తోంది భారత రైల్వే శాఖ. మొదటి హై స్పీడ్ రైల్ కారిడార్ ముంబయి-అహ్మదాబాద్ మధ్య రానుండగా.. ఆ తర్వాత చెన్నై-మైసూరు మధ్య రెండో స్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. చెన్నై టూ మైసూర్ వయా బెంగళూరు ఈ హై స్పీడ్ ట్రైన్ పరుగుcbn{#}Rail;Train;GEUM;Press;Chennai;Indiaఆంధ్రాకి మోడీ మరో గిఫ్ట్‌.. బాబు భలే పిండేస్తున్నాడుగా?ఆంధ్రాకి మోడీ మరో గిఫ్ట్‌.. బాబు భలే పిండేస్తున్నాడుగా?cbn{#}Rail;Train;GEUM;Press;Chennai;IndiaSun, 28 Jul 2024 06:56:00 GMTసాధారణ రైళ్లు, ఎక్స్  ప్రెస్ రైళ్లు, శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లు, గరీభ్ రథ్ ట్రైన్స్, ఇలా ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వందే భారత్ రైళ్లు వచ్చేశాయ్. ఇకపై వందే భారత్ స్లీపర్స్ ట్రైన్స్ రానున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ గా పేరు గాంచిన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టును శర వేగంగా పూర్తి చేస్తోంది భారత రైల్వే శాఖ.


మొదటి హై స్పీడ్ రైల్ కారిడార్ ముంబయి-అహ్మదాబాద్ మధ్య రానుండగా.. ఆ తర్వాత చెన్నై-మైసూరు మధ్య రెండో స్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. చెన్నై టూ మైసూర్ వయా బెంగళూరు ఈ హై స్పీడ్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం కేవలం 90 నిమిషాలకు తగ్గనుంది. అయితే రెండో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడాన్ ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాలను కలుపుతూ 463 కిలో మీటర్ల మేర విస్తరించనుంది.


చెన్నై, మైసూరు మధ్య నడిచే రైలుకి కేవలం 11 స్టాప్ లు మాత్రమే ఉంటాయి. ఈ మార్గంలోని చెన్నై, పూనమల్లి, చిత్తూరు, కోలార్, కోడహళ్లి, వైట్ ఫీల్డ్, బైయప్పపల్లి, ఎలక్ర్టానిక్ సిటీ, కెంగేరి, మాండ్య, మైసూరు స్టాప్ లుగా ఉండనున్నాయి. గంటకు 350 కి.మీ. ల వేగంతో 320 కమి.మీల వేగంతో సగటున 250 కి.మీ. వేగంతో నడిచే ఈ రెళ్ల కోసం హై స్పీడ్ కనెక్టవిటీ కారిడార్ ను నిర్మించనుంది రైల్వే శాఖ.


ఈ ప్రాజెక్టు కోసం చెన్నైలోని 2.5 కి.మీ. ఏపీలోని చిత్తూరులో 11.8 కి.మీ. బెంగళూరు రూరల్ లో 2 కి.మీ. బెంగళూరు నగరంలో 14 కి.మీ. మేర 30 కి.మీ. టన్నెల్ నెట్ వర్క్ ఉంటుంది. ప్రాజెక్టు మొదటి దశ నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ. రెండో దశ బెంగళూరు నుంచి మైసూరు వరకు 175 కి.మీ. విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 313 పట్టణాలు, గ్రామాలు భాగం కానున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>