Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya3b8a0b6e-285c-45e2-b21d-2eb58bd40fcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya3b8a0b6e-285c-45e2-b21d-2eb58bd40fcf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇటీవలే ఒక లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా ఏకంగా టి20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు సూర్యకుమార్. ఇక అతని కెప్టెన్సీ లోనే ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో భాగంగా టి20 సిరీస్ లో బరిలోకి దిగింది టీం ఇండియా. ఈ క్రమంలోనే సూర్యకుమార్ కెప్టెన్ గా ఎలా అదరగొట్టబోతున్నాడు అనే విషయంపై అందరిలో ఆసక్తిని నెలకొంది అని చెప్పాలి. అయితే కెప్టెన్ గా మాత్రమే కాకుండా సూర్య వ్యక్తిగత ప్రదర్శన విషయSurya{#}raja;surya sivakumar;VIRAT KOHLI;Sri Lanka;INTERNATIONAL;Mister;Yevaruకెప్టెన్గా మొదటి మ్యాచ్ లోనే అదరహో.. కోహ్లీ సరసన నిలిచిన సూర్య?కెప్టెన్గా మొదటి మ్యాచ్ లోనే అదరహో.. కోహ్లీ సరసన నిలిచిన సూర్య?Surya{#}raja;surya sivakumar;VIRAT KOHLI;Sri Lanka;INTERNATIONAL;Mister;YevaruSun, 28 Jul 2024 08:05:00 GMTప్రస్తుతం భారత జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇటీవలే ఒక లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా ఏకంగా టి20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు సూర్యకుమార్. ఇక అతని కెప్టెన్సీ లోనే ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో భాగంగా టి20 సిరీస్ లో బరిలోకి దిగింది టీం ఇండియా. ఈ క్రమంలోనే సూర్యకుమార్ కెప్టెన్ గా ఎలా అదరగొట్టబోతున్నాడు అనే విషయంపై అందరిలో ఆసక్తిని నెలకొంది అని చెప్పాలి. అయితే కెప్టెన్ గా మాత్రమే కాకుండా సూర్య వ్యక్తిగత ప్రదర్శన విషయంలో ఎలా అదరగొడతాడో చూడాలని అందరూ ఎదురు చూశారు.


 అయితే అందరూ ఊహించినట్లుగానే సూర్య కుమార్ యాదవ్ మొదటి మ్యాచ్ లోనే మ్యాజిక్ చేసి చూపించాడు. కెప్టెన్సీ తో అటు భారత జట్టుకు ఘనవిజయాన్ని అందించడమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొట్టేసాడు అని చెప్పాలి. ఏకంగా 26 బంతుల్లోనే 58 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు ఈ నయా మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఇక ఈ మ్యాచ్ లో అటు 42 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక తొలి టి20 మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.


 అయితే ఈ అవార్డు రావడంతో సూర్యకుమార్ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ టి20 లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్గా కోహ్లీ సరసన నిలిచాడు సూర్య. ఇప్పటివరకు ఏకంగా 16 సార్లు ఈ అవార్డులు అందుకున్నాడు టీమిండియా నయా కెప్టెన్. విరాట్ కోహ్లీ 125 మ్యాచ్లలో 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధిస్తే.. సూర్య మాత్రం 69 మ్యాచుల్లోనే ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో సికిందర్ రాజా 15, నబి 14, రోహిత్ 14 సార్లు ఈ అవార్డులు అందుకొని తర్వాత స్థానంలో ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>