PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/freebussscheme94c68cf4-bb24-46af-ac5a-4eb7480b983b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/freebussscheme94c68cf4-bb24-46af-ac5a-4eb7480b983b-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన అమలు పైన అధికారులు నివేదిక అందించారు. నెలకు రూ250 కోట్లు మేర ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ పథకం అమలు పైన తుది నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయనfreebussscheme{#}RTC;monday;Coimbatore;Vishakapatnam;bus;Andhra Pradesh;Telangana Chief Minister;CBN;Government;Vijayawadaఏపీ: ఉచిత బస్సు ప్రయాణంపై తాజా అప్డేట్..!ఏపీ: ఉచిత బస్సు ప్రయాణంపై తాజా అప్డేట్..!freebussscheme{#}RTC;monday;Coimbatore;Vishakapatnam;bus;Andhra Pradesh;Telangana Chief Minister;CBN;Government;VijayawadaSun, 28 Jul 2024 14:15:00 GMTఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన అమలు పైన అధికారులు నివేదిక అందించారు. నెలకు రూ250 కోట్లు మేర ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ పథకం అమలు పైన తుది నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు.ఆర్టీసీ, రవాణా శాఖలపై సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో నివేదకపై కీలక చర్చ జరగనుంది.ఉచిత బస్సు పెడితే ఎంత ఖర్చు అవుతుంది ? ఎంత నష్టం ఉంటుంది ? ఫ్రీ బస్సు కోసం ఖర్చు చేసే డబ్బులను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేదానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీస్ లతోపాటు విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో సర్వీసులలో ఉచిత సదుపాయం కల్పించేలా… చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆగస్టు 15 తర్వాత… ఈ స్కీమ్ అమలు చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఎలా అనే విషయాలపై అధ్యయనం చేశారు. ఏపీఎస్‌ ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుందన్నారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, హైదరాబాద్‌ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారన్నారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు గుర్తించామన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>