HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/noro-virus306ca347-2931-4baa-91d7-a94205a8c143-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/noro-virus306ca347-2931-4baa-91d7-a94205a8c143-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలిసిందే. అత్యంత బలవంతుడిని అని అనుకున్న మనిషి కనబడని ఓ జీవికి ఎలా గజగజలాడాడో కూడా బాగా తెలుసు. ఈ క్రమంలోనే మనిషి అనే వాడు వైరస్ పేరు చెబితేనే చలి జ్వరం పట్టినవాడిలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాదు వాసుల పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అవును, కరోనా భూతాన్ని మరవకముందే నోరో వైరస్ భయంతో భాగ్యనగరం అటుకు పోతోంది. noro virus{#}Coronavirus;GHMC;Hyderabadనోరో వైరస్ ని లైట్ తీసుకోవద్దు... ఇలా జాగ్రత్తలు పాటిస్తే సరి!నోరో వైరస్ ని లైట్ తీసుకోవద్దు... ఇలా జాగ్రత్తలు పాటిస్తే సరి!noro virus{#}Coronavirus;GHMC;HyderabadSun, 28 Jul 2024 15:00:00 GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలిసిందే. అత్యంత బలవంతుడిని అని అనుకున్న మనిషి కనబడని ఓ జీవికి ఎలా గజగజలాడాడో కూడా బాగా తెలుసు. ఈ క్రమంలోనే మనిషి అనే వాడు వైరస్ పేరు చెబితేనే చలి జ్వరం పట్టినవాడిలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాదు వాసుల పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అవును, కరోనా భూతాన్ని మరవకముందే నోరో వైరస్ భయంతో భాగ్యనగరం అటుకు పోతోంది.

విషయం ఏమిటంటే.. నోరో వైరస్ కారణంగా భాగ్యనగరంలో దాదాపు 100 కి పైగా కేసులు నమోదయాయని జిహెచ్ఎంసి అధికారులు తాజాగా వెల్లడించారు. నడుస్తున్నది వర్షాకాలం కావడంతో, పైగా హైదరాబాదులో ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు సంబంధిత అధికారులు. ఈ క్రమంలోనే దాని బారిన పడకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచనలు చేస్తున్నారు హైదరాబాదు వాసులకు. కాబట్టి క్రింది చర్యలు పాటించి భాగ్యనగరం ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆశిద్దాం.

వర్షాకాలం కారణంగా తేమ అధికంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు శరీరాన్ని పొడి బట్టలతో కప్పి ఉంచాలి. అంటే అపరిశుభ్రమైన దుస్తులను ధరించకుండా.. ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. కాలువలు ఉన్నచోట దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను ఎక్కువగా బయట పెట్టకుండా... వర్షంలో తడవకుండా చూసుకోవాలి. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వంటి వ్యాధులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కరోనా సమయంలో మాస్కులు ధరించినట్లే... విధిగా అందరూ బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకునే వెళ్లడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక నొరో వ్యాప్తి నేపథ్యంలో ghmc చేసిన సూచనలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అవిఏమిటంటే వేడి చేసి చల్లార్చి వడపోసిన నీటిని  మాత్రమే తాగాలి , చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి , ఇంటిని పరిసరాలను కచ్చితంగా  పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అధికారులు తెలుపుతున్నారు.

" style="height: 1078px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>