Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralcf5f0a20-1856-4be0-b23e-def7de996488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralcf5f0a20-1856-4be0-b23e-def7de996488-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి.. గంటల తరబడి సోషల్ మీడియాలో కాలంక్షేపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇంటర్నెట్లో ఎప్పుడు దొరకని సరికొత్త ఎంటర్టైన్మెంట్ దొరుకుతూ ఉండడంతో బయట ప్రపంచంతో మనిషికి అవసరమే లేకుండా పోయింది. పక్కనే ఉన్న స్నేహితులతో మాట్లాడటం మానేసి ఎక్కడో ఉన్నవారితో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇష్టపడుతున్నాడు. ఇలా సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తున్న మనిషి తల ఎత్తి బయట పViral{#}media;police;local languageరైల్వేస్టేషన్లో యువకుడి స్టంట్.. పోలీసులు ఇంటికెళ్లి చూసి షాక్?రైల్వేస్టేషన్లో యువకుడి స్టంట్.. పోలీసులు ఇంటికెళ్లి చూసి షాక్?Viral{#}media;police;local languageSun, 28 Jul 2024 09:15:00 GMTనేటి రోజుల్లో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి.. గంటల తరబడి సోషల్ మీడియాలో కాలంక్షేపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇంటర్నెట్లో ఎప్పుడు దొరకని సరికొత్త ఎంటర్టైన్మెంట్ దొరుకుతూ ఉండడంతో బయట ప్రపంచంతో మనిషికి అవసరమే లేకుండా పోయింది. పక్కనే ఉన్న స్నేహితులతో మాట్లాడటం మానేసి ఎక్కడో ఉన్నవారితో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇష్టపడుతున్నాడు.



 ఇలా సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తున్న మనిషి తల ఎత్తి బయట ప్రపంచాన్ని చూడ్డానికి మాత్రం అస్సలు ఇష్టపడటం లేదు. అయితే కొంతమంది సోషల్ మీడియా చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతుంటే.. ఇంకొంతమంది మాత్రం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలా పాపులారిటీ సంపాదించడం కోసం కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టే విన్యాసాలను చేస్తూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక యువకుడు ఇలాంటి విన్యాసమే చేశాడు. చివరికి ఊహించని రీతిలో జీవితాన్ని దుర్భరం చేసుకున్నాడు అని చెప్పాలి.


 ముంబైలోని ఒక రైల్వే స్టేషన్ లో కదులుతున్న లోకల్ ట్రైన్ పట్టుకొని ఓ యువకుడు ఫ్లాట్ ఫాంపై విన్యాసం చేసిన ఒక ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. అయితే దీనిని ఒక నెటిజన్ షేర్ చేయడంతో రైల్వే పోలీసులు స్పందించారు. అతడిని గుర్తించి ఇంటికి వెళ్లి చూసారు. అక్కడికి వెళ్ళాక పోలీసుల షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక కాలు చెయ్యి కోల్పోయి అతను బెడ్ పై కనిపించాడు. ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల అతనికి ప్రమాదం జరిగి కాలు చేయిపోయిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలి అంటూ సెంట్రల్ రైల్వే హెచ్చరించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>