Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulquer-salmanbba0f904-d2be-4ae8-a295-a6b3e79d94ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulquer-salmanbba0f904-d2be-4ae8-a295-a6b3e79d94ff-415x250-IndiaHerald.jpgమలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఓ పక్క మలయాళంలో మాస్ హీరోగా మంచి ఫాం కొనసాగిస్తున్నాడు. ఐతే అక్కడ సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఆ సినిమాలో ఆయన చేసిన జెమిని గణేషన్ పాత్రతో ఆడియన్స్ ని మెప్పించాడు. Dulquer Salman{#}Gemini;Kanna Lakshminarayana;tara;geetha;bhaskar;Baba Bhaskar;Mahanati;dulquer salmaan;Mammootty;Posters;Mass;sandeep;Audience;Hero;Telugu;Cinemaమలయాళ హీరోకి మరో మంచి సినిమా.. మన వాళ్లు లేకనా మరో కారణమా..?మలయాళ హీరోకి మరో మంచి సినిమా.. మన వాళ్లు లేకనా మరో కారణమా..?Dulquer Salman{#}Gemini;Kanna Lakshminarayana;tara;geetha;bhaskar;Baba Bhaskar;Mahanati;dulquer salmaan;Mammootty;Posters;Mass;sandeep;Audience;Hero;Telugu;CinemaSun, 28 Jul 2024 22:31:00 GMTమలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఓ పక్క మలయాళంలో మాస్ హీరోగా మంచి ఫాం కొనసాగిస్తున్నాడు. ఐతే అక్కడ సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఆ సినిమాలో ఆయన చేసిన జెమిని గణేషన్ పాత్రతో ఆడియన్స్ ని మెప్పించాడు. ఆ తర్వాత సీతారామం సినిమాతో మరో సూపర్ హిట్ దక్కించుకున్నాడు.

ఇక లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. ఐతే ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో సినిమా లైన్ లో పెట్టాడు దుల్కర్. మలయాళ స్టార్ హీరోగ పవర్ సాధినేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆకాశంలో ఒక తార. గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్ కలిసి సమర్పిస్తున్న ఈ సినిమాను సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.

ఆకాశంలో ఒక తార ఆసక్తికరమైన టైటిల్. పోస్టర్ తోనే సినిమాపై ఒక పాజిటివ్ బజ్ వచ్చేలా చేశారు. ఐతే దుల్కర్ సల్మాన్ దాకా కథలు వెళ్తున్నాయి అంటే మన హీరోలు చేయనంటున్నారా లేదా ఆయనకు మాత్రమే సూటయ్యే కథలని అనుకుంటున్నారో తెలియట్లేదు. ఆకాశంలో ఒక తార టైటిల్ ఆ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే కచ్చితంగా ఒక మంచి కథతోనే వస్తుందని అనిపిస్తుంది. మరి ఇంత మంచి కథను ఎందుకు మలయాళ హీరో దాకా వెళ్లేలా చేశారన్నది ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు. తన దాకా వచ్చిన సినిమాల్లో దుల్కర్ చాలా తెలివిగా వడకడుతూ మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. 

దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుండగా ఆ సినిమా రిలీజ్ కన్నా ముందు సినిమా ప్రకటించి తెలుగులో తాను కూడా ఒక స్ట్రైట్ హీరో రేంజ్ అనుకునేలా చేస్తున్నాడు దుల్కర్. నేడు బర్త్ డే కాబట్టి పోస్టర్ వదిలారు అనుకోవచ్చు కానీ తెలుగు హీరోలను దాటి మలయాళ హీరో దాకా కథలు వెళ్తున్నాయంటే మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>