Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyan1f7b4573-38e4-456e-bcd4-146d4b36d927-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyan1f7b4573-38e4-456e-bcd4-146d4b36d927-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ గా వున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు వున్నాయి. ఈ సినిమాలు త్వరలోలోనే పూర్తి చేసి సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ముందుగా ఏ సినిమా షూటింగ్ మొదలు పెడతారు అనేది క్లారిటీ రాలేదు. గతంలో హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం కీలక ప్రకటన చేసారు. పవన్ త్వరలో హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస#pawan kalyan{#}kalyan;kushi;sujeeth;Kushi;Saaho;Gangster;producer;Producer;Darsakudu;jyothi;December;Director;Andhra Pradesh;Cinemaపవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీ సిద్ధం అవుతుందా..?పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీ సిద్ధం అవుతుందా..?#pawan kalyan{#}kalyan;kushi;sujeeth;Kushi;Saaho;Gangster;producer;Producer;Darsakudu;jyothi;December;Director;Andhra Pradesh;CinemaSat, 27 Jul 2024 10:19:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ గా వున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు వున్నాయి. ఈ సినిమాలు త్వరలోలోనే పూర్తి చేసి సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ముందుగా ఏ సినిమా షూటింగ్ మొదలు పెడతారు అనేది క్లారిటీ రాలేదు. గతంలో హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం కీలక ప్రకటన చేసారు. పవన్ త్వరలో హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పవన్ షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ సినిమా షూటింగ్ మొదలయి చాలా ఏళ్లు అయిన అంతకంతకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇంకా ఈ సినీమాకు సంబంధించి కొంతభాగం పెండింగ్ లో వుంది. పవన్ డేట్స్ ఇస్తే పూర్తి చేసేందుకు దర్శకుడు క్రిష్ ఎదురు చూసారు.

 అయితే సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఆయన ఈ సినిమాను నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా మిగతా భాగం ఏఎంరత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలూగా తెరకెక్కుతుంది. ఇదిలా పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 20 రోజులు షూటింగ్ బ్యాలన్స్ వుంది.ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ మొదట ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ తరువాత హరిహరవీరమల్లు షూటింగ్కు పూర్తి డేట్స్ కేటాయించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఓజీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.ఈ న్యూస్ తెలిసి పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>