DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modie9617f4f-da6e-4876-8490-0543edad25cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modie9617f4f-da6e-4876-8490-0543edad25cb-415x250-IndiaHerald.jpgమన దేశానికి రాజ్యాంగం ఒకటే. ప్రజలందరికీ రాజ్యాంగమే శిరోధార్యం. కానీ చట్టాలే కాస్త విభిన్నం. వివాహం, వారసత్వానికి సంబంధించి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో మతానికి వేర్వేలు చట్టాలు. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా మతాల ఆధారంగా చట్టాలు అమలు. దీనిపై సుదీర్ఘకాలంగా దేశంలో భిన్నాభిప్రాయాలు, వివాదలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గం ఒకటే అని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్కృతి చట్టాన్ని తెరపైకి తెచ్చింది. ఈ చట్టాన్ని దేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. ఈ ఘనతను ఉత్తరmodi{#}Bharatiya Janata Party;Assembly;October;Uttarakhand;CMమోదీ ఉత్తరాఖండ్ మోడల్‌.. దేశమంతా అమలు చేస్తారా?మోదీ ఉత్తరాఖండ్ మోడల్‌.. దేశమంతా అమలు చేస్తారా?modi{#}Bharatiya Janata Party;Assembly;October;Uttarakhand;CMSat, 27 Jul 2024 13:00:00 GMTమన దేశానికి రాజ్యాంగం ఒకటే. ప్రజలందరికీ రాజ్యాంగమే శిరోధార్యం. కానీ చట్టాలే కాస్త విభిన్నం. వివాహం, వారసత్వానికి సంబంధించి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో మతానికి వేర్వేలు చట్టాలు.  ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా  మతాల ఆధారంగా చట్టాలు అమలు. దీనిపై సుదీర్ఘకాలంగా దేశంలో భిన్నాభిప్రాయాలు, వివాదలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గం ఒకటే అని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్కృతి చట్టాన్ని తెరపైకి తెచ్చింది.  


ఈ చట్టాన్ని దేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. ఈ ఘనతను ఉత్తరాఖండ్ సాధించింది. యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సాధించింది. గోవాలో ఆల్రెడీ యూసీసీ అమలు అవుతున్నా దాని స్వరూప స్వభావాలు భిన్నమైనవి.


వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో అందరికీ ఒక తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ థామీ ప్రకటించారు. ఇది గిరిజనులకు మాత్రం వర్తించదు. దేశంలో ఇది కీలకమైన సందర్భం అని తెలిపారు. భారత రాజ్యాంగంలోని 44 వ ఆర్టికల్ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్కృతి వర్తింపజేయాలని సూచిస్తోంది. దీనిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈ ఆర్టికల్ ను అమలు చేస్తున్నాం అని ప్రకటించారు.


ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది. ఇప్పుడు అమలు కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు కల్లా యూసీసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే అంశంపై ఆ  రాష్ట్రం సీఎం ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. యూసీసీ అమలుకు విధి విధానాలు, కార్యాచరణ ప్రణాళికపై ఉన్నతాధికారులు, ఉన్నత స్థాయి కమిటీని నిపుణులతో కలిసి పుష్కర్ సింగ్ థామీ సమీక్షించారు. నిర్ణీత కాల వ్యవధిని పెట్టుకొని అప్పటిలోగా విధి విధానాలు ఖరారు చేయాలని నిపుణులు బృందానికి ఆయన దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా స్వాత్రంత్ర్యం అనంతరం ఉమ్మడి పౌర స్కృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>