PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vidadala-rajini-ycp-ycp-mlc-appi-reddy-appi-reddy-ex-minister-vidadala-rajini-mlc-chandragiri-yesu-ratnam2fd630fc-00c9-4d2f-8c05-f4643b31ad92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vidadala-rajini-ycp-ycp-mlc-appi-reddy-appi-reddy-ex-minister-vidadala-rajini-mlc-chandragiri-yesu-ratnam2fd630fc-00c9-4d2f-8c05-f4643b31ad92-415x250-IndiaHerald.jpgవైసీపీలో జగన్ పదేపదే నా బీసీ .. నా ఎస్సీ .. నా ఎస్టి ... నా మైనార్టీలు అని ఎంత చెప్పుకున్న బీసీలు .. ఇతర కులాలకు ఎన్ని పదవులు ఇచ్చినా పెత్తనం అంత రెడ్లదే సాగింది. ఐదేళ్లలో బీసీలు .. ఎస్సీలు .. ఎస్టీలకు జగన్ ఇచ్చిన పదవులు కేవలం లెక్కల వరకే .. ! కీలకమైన రాజ్యాధికారం పెత్తనం అంతా రెడ్ల చేతుల్లోనే పెట్టారు. పైగా ఆంధ్రప్రదేశ్ ను ప్రాంతాలవారీగా విభజించి మరి జగన్ రెడ్లను ఇన్చార్జిలుగా వేసి వాళ్ళకే పెత్తనం అప్పగించారు. చివరకు ఇద్దరు మహిళల‌ను హోమ్ మంత్రులను నియమించినా వాళ్ళను కూడా డ‌మ్మీలను చేసి రెడ్లు పvidadala Rajini; ycp; ycp MLC appi reddy; appi reddy; ex minister Vidadala Rajini; MLC Chandragiri Yesu Ratnam{#}Lella Appi Reddy;Chandragiri;Chilakaluripeta;Yevaru;Guntur;Backward Classes;Scheduled caste;House;Jagan;Minister;YCP;Andhra Pradeshవైసీపీలో బీసీల‌ను అడ్డంగా తొక్కేస్తోన్న ఆ రెడ్డి ఎవ‌రు ?వైసీపీలో బీసీల‌ను అడ్డంగా తొక్కేస్తోన్న ఆ రెడ్డి ఎవ‌రు ?vidadala Rajini; ycp; ycp MLC appi reddy; appi reddy; ex minister Vidadala Rajini; MLC Chandragiri Yesu Ratnam{#}Lella Appi Reddy;Chandragiri;Chilakaluripeta;Yevaru;Guntur;Backward Classes;Scheduled caste;House;Jagan;Minister;YCP;Andhra PradeshSat, 27 Jul 2024 09:53:00 GMTవైసీపీలో జగన్ పదేపదే నా బీసీ .. నా ఎస్సీ .. నా ఎస్టి ... నా మైనార్టీలు అని ఎంత చెప్పుకున్న బీసీలు .. ఇతర కులాలకు ఎన్ని పదవులు ఇచ్చినా పెత్తనం అంత రెడ్లదే సాగింది. ఐదేళ్లలో బీసీలు .. ఎస్సీలు .. ఎస్టీలకు జగన్ ఇచ్చిన పదవులు కేవలం లెక్కల వరకే .. ! కీలకమైన రాజ్యాధికారం పెత్తనం అంతా రెడ్ల చేతుల్లోనే పెట్టారు. పైగా ఆంధ్రప్రదేశ్ ను ప్రాంతాలవారీగా విభజించి మరి జగన్ రెడ్లను ఇన్చార్జిలుగా వేసి వాళ్ళకే పెత్తనం అప్పగించారు. చివరకు ఇద్దరు మహిళల‌ను హోమ్ మంత్రులను నియమించినా వాళ్ళను కూడా డ‌మ్మీలను చేసి రెడ్లు పెత్తనం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పిన కిలారు రోశయ్య వైసీపీలో రెడ్ల పెత్తనంపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. పేరు చెప్పకపోయినా తన ఓటమికి ఎమ్మెల్సీ .. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన లేళ్ల‌ అప్పిరెడ్డి కారణం అని తన ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చంద్రగిరి ఏసురత్నం ఓటమికి కారణం ఎవరు ? అందరికీ తెలిసిన తెగేసి చెప్పారు.


ఆ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయం సాధించినా పశ్చిమంలో యేసు రత్నం ఓడిపోవడానికి అప్పిరెడ్డి కారణం అన్న చర్చ‌ నడిచింది. ఆయన గెలిస్తే పశ్చిమ నియోజకవర్గం లో తన పట్టు ఎక్కడ పోతుందో అని అప్పిరెడ్డి ఏసురత్నాన్ని ఓడించారన్న ప్రచారం జరిగింది. 2014లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అప్పిరెడ్డి ఓడిపోయారు. జగన్ 2019లో ఆయనకు సీటు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే పశ్చిమ నియోజకవర్గంలో తన పట్టు కోసం యేసు రత్నాన్ని ఆయనే ఓడించారని ప్రచారం జరిగింది. ఇక ఇటీవల ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి పశ్చిమ నియోజకవర్గానికి అప్ప‌టి మంత్రి విడ‌ద‌ల రజ‌ని బదిలీ మీద వచ్చారు.. ఆమెను కూడా ఓడించాలని అప్పిరెడ్డి చక్రం తిప్పారని.. ఆమె గెలిస్తే నియోజకవర్గం లో తన పట్టు ఉండదని... ఆమె ఓట‌మికి కూడా అప్పిరెడ్డి కారణమయ్యారని వైసీపీ వాళ్లే విమర్శలు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>