EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kamala21fe2a48-8610-4862-b59c-18d8855e0f43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kamala21fe2a48-8610-4862-b59c-18d8855e0f43-415x250-IndiaHerald.jpgఒకటి తర్వాత మరొకటి అన్నట్లు చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి అడ్డంకి ఉండదన్న భావన సర్వత్రా నెలకొంది. ఈ సమయంలో చోటు చేసుకున్న కీలక పరిణామం … ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకోవడం, సీన్లోకి దేశ ఉపాధ్యక్ష పదవిని నిర్వర్తిస్తున్న కమలా హ్యారిస్ ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. బైడెన్ ఉన్న సమయంలో ట్రంప్ వైపు మొగ్గు చూపిన అమెరికన్లు.. ఇప్పుడు కమల kamala{#}American Samoa;Donald Trump;November;Survey;bhavana;Partyఅమెరికా ఎన్నికల్లో ఇండియాకు లాభించే అద్భుతం జరగబోతోందా?అమెరికా ఎన్నికల్లో ఇండియాకు లాభించే అద్భుతం జరగబోతోందా?kamala{#}American Samoa;Donald Trump;November;Survey;bhavana;PartySat, 27 Jul 2024 06:00:00 GMTఒకటి తర్వాత మరొకటి అన్నట్లు చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి అడ్డంకి ఉండదన్న భావన సర్వత్రా నెలకొంది. ఈ సమయంలో చోటు చేసుకున్న కీలక పరిణామం … ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.


అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకోవడం, సీన్లోకి దేశ ఉపాధ్యక్ష పదవిని నిర్వర్తిస్తున్న కమలా హ్యారిస్ ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. బైడెన్ ఉన్న సమయంలో ట్రంప్ వైపు మొగ్గు చూపిన అమెరికన్లు.. ఇప్పుడు కమల రాకతో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా ఎంట్రీ అనంతరం నిర్వహించిన ప్రీ పోల్  సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. వీటి సారాంశం ఏంటంటే.. డొనాల్డ్ ట్రంప్ ని ఓడించి హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం కమలాకు ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రాయిటర్ ఇప్పాస్ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ లో ట్రంప్ నకు 42 పాయింట్లు లభించగా.. కమలాకు 44 పాయింట్లు రావడం ఆసక్తికరంగా మారింది.


ఇదే సందర్భంగా పీబీఎస్ న్యూస్.. ఎన్ పీఆర్, మారిస్ట్ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలోను ట్రంప్.. కమలా మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు వెల్లడైంది. ఈ ప్రీ పోల్ లో ట్రంప్ నకు 46 శాతం మద్దతు లభిస్తే.. కమలాకు 45 శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపిన వైనం అమెరికా అధ్యక్ష పోటీని ఆసక్తికరంగా మార్చింది.


అధ్యక్ష పదవి బరి నుంచి బైడెన్ తప్పుకోవడం సరైన నిర్ణయంగా పార్టీలకు అతీతంగా అన్ని వయసుల వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రోజుల్లోనే కమలా హారిస్ కు ఇంత మద్దతు లభించడంతో నవంబర్ నాటికి ఆమె ట్రంప్ పై భారీ ఆధిక్యంతో ఉంటారు అని డెమొక్రటిక్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమెకు ఇంత మద్దతు పెరగడానికి వయసే కారణమని చెబుతున్నారు. ట్రంప్ వయసు 78 ఏళ్లు కాగా… కమలా వయసు  59 ఏళ్లు మాత్రమే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>