MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movie-news-latest0f65e516-7337-4eb3-8d76-62726ff41541-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movie-news-latest0f65e516-7337-4eb3-8d76-62726ff41541-415x250-IndiaHerald.jpgదూరం నుండి చూసిన వారికి సినిమా ఓ అందాల లోకం. కానీ వాస్తవం ఏమిటనేది సినిమా చూసే జనాలకి తెలియదు. సినిమా ఆర్టిస్టుల జీవితం స్వర్గ లోకం అనుకుంటారు. కానీ అది అనుకున్నంత సులువు కాదు! అందరి జీవితం ఒకే విధంగా ఉండడు. ఈ రంగంలో అయినా అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఇందులో కూడా అదే వర్తిస్తుంది. ఇక దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోగ‌లిగే ఆర్టిస్టులు అతి కొద్దిమంది మాత్ర‌మే. జూనియ‌ర్ ఆర్టిస్టులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు నిరంత‌రం ఆదాయ మార్గాలు అనేవి ఉండ‌వు. నెలకి ఓ పది రోజులు పనుంటే, మిగతా ఇరవై రోజులు tollywood movie news latest{#}Syamala;Athadu;Hero;Cinema;Successసుప్రీం హీరోకి ధన్యవాదాలు తెలిపిన పావలా శ్యామల!సుప్రీం హీరోకి ధన్యవాదాలు తెలిపిన పావలా శ్యామల!tollywood movie news latest{#}Syamala;Athadu;Hero;Cinema;SuccessSat, 27 Jul 2024 17:00:00 GMTదూరం నుండి చూసిన వారికి సినిమా ఓ అందాల లోకం. కానీ వాస్తవం ఏమిటనేది సినిమా చూసే జనాలకి తెలియదు. సినిమా ఆర్టిస్టుల జీవితం స్వర్గ లోకం అనుకుంటారు. కానీ అది అనుకున్నంత సులువు కాదు! అందరి జీవితం ఒకే విధంగా ఉండడు. ఈ రంగంలో అయినా అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఇందులో కూడా అదే వర్తిస్తుంది. ఇక దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోగ‌లిగే ఆర్టిస్టులు అతి కొద్దిమంది మాత్ర‌మే. జూనియ‌ర్ ఆర్టిస్టులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు నిరంత‌రం ఆదాయ మార్గాలు అనేవి ఉండ‌వు. నెలకి ఓ పది రోజులు పనుంటే, మిగతా ఇరవై రోజులు పని ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితి ఉంటుంది.

ఇక వీరి అసోసియేష‌న్ల సాయం కూడా ప‌రిమితం మాత్ర‌మే. ఈ క్రమంలో వారి వృద్ధాప్య జీవితాన్ని ముందుకు నెట్టుకు రావాలంటే అది ఎంత భారంగా గడుస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అలాంటి స‌మ‌స్య‌ల సుడిగుండంలో ఉన్న ఆర్టిస్టులు కృష్ణాన‌గ‌ర్, ఫిలింన‌గ‌ర్లో కోకొల్లలుగా ఉంటారు. చాలా కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న న‌టి పావలా శ్యామలను ప‌లుమార్లు మెగా కుటుంబీకులు పరామర్శించి సాయం చేసిన సంగతి తెలిసినదే. అయినా ఇప్ప‌టికీ పోష‌ణ భార‌మై క‌ష్ట‌కాలంలో ఉన్న శ్యామ‌ల‌ను ఆదుకోవడానికి ఇప్పుడు మెగా కుటుంబం నుంచే సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ (సాయి ధరమ్ తేజ్) ముందుకు వ‌చ్చారు.

మామయ్య‌లు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ దారిలోనే మేనల్లుడు కూడా నడుస్తుండడం కొసమెరుపు. పావ‌లా శ్యామ‌ల‌ మనుగడ, వైద్య ఖర్చుల కోసం సాయి తేజ్ ఆమెకు 5 లక్ష రూపాయలతో సహాయం చేశాడు. ఈ నేపథ్యంలో అతడు వీడియో కాల్ లో శ్యామ‌ల‌తో మాట్లాడాడు. భవిష్యత్తులోను ఈ వృద్ధ ఆర్టిస్టుకు తన మద్దతు ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పావలా శ్యామల అతనికి కృతజ్ఞతలు తేలిపోయింది. అదలా ఉంచితే... ఇటీవల బాల‌ల వేధింపుల వీడియోను షేర్ చేసిన‌ సాయి తేజ్ సదరు యుట్యూబర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివ‌రికి దోషుల‌కు శిక్ష ప‌డేలా చేసి సాయి నిజమైన హీరో అనిపించుకున్నాడు కూడా!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>