PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3ba6fb37-0d02-4075-8d17-c5c56700862a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3ba6fb37-0d02-4075-8d17-c5c56700862a-415x250-IndiaHerald.jpgఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నామమాత్రంగా 11 అనే సంఖ్యకు పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దాంతో శాసనసభకు వచ్చే అర్హతను కోల్పోయింది వైసీపీ. అందువలన ఆంధ్ర శాసనసభ సమావేశాల్లో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు చోటు చేసుకోవడం చాలా కష్టం. కానీ తెలంగాణ పరిస్థితి అది కాదు.. ప్రతిపక్ష టిఆర్ఎస్ సభ్యులు, అధినేత కెసిఆర్ శాసనసkcr{#}sanyasam;KCR;Telangana;CM;Congress;Telugu;Andhra Pradesh;Party;Minister;Cinemaకెసిఆర్ కి అలాంటి మాటలు కొత్త కాదు?కెసిఆర్ కి అలాంటి మాటలు కొత్త కాదు?kcr{#}sanyasam;KCR;Telangana;CM;Congress;Telugu;Andhra Pradesh;Party;Minister;CinemaFri, 26 Jul 2024 18:00:00 GMTఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నామమాత్రంగా 11 అనే సంఖ్యకు పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దాంతో శాసనసభకు వచ్చే అర్హతను కోల్పోయింది వైసీపీ. అందువలన ఆంధ్ర శాసనసభ సమావేశాల్లో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు చోటు చేసుకోవడం చాలా కష్టం. కానీ తెలంగాణ పరిస్థితి అది కాదు.. ప్రతిపక్ష టిఆర్ఎస్ సభ్యులు, అధినేత కెసిఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడంతో అక్కడ వాడివే డిగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్... కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. విషయం ఏమిటంటే... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... "కెసిఆర్ స్థానంలో నేనుంటే రాజకీయ సన్యాసం తీసుకొనేవాడని!" అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మాటలను కెసిఆర్ తప్పుపడుతూ... కోమటిరెడ్డి పై విరుచుకుపడ్డారు.

కెసిఆర్ ఆ మాటలకు కౌంటర్ ఇస్తూ.. " రాజకీయ సన్యాసం తీసుకోవడం కాదు గాని... మిమ్మల్ని రాజకీయ సన్నాసులను చేస్తాను... ఖబడ్దార్! " అంటూ వ్యాఖ్యానించారు. ఈ డైలాగ్ ఎప్పుడైతే కేసీఆర్ నోటి నుండి వచ్చిందో ఆ వెంటనే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కర్రతాల ధ్వనులతో శాసనసభను మారుమరోగించారు. అయితే ఆ వెంటనే అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి... ఇలాంటి సినిమా డైలాగులు కొట్టే... పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చారంటూ విమర్శలు చేయడం జరిగినది. ఈ క్రమంలో ఇరువురి మధ్య చాలా గట్టిగా వాదోపవాదనలు జరిగాయి. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో బిఆర్ఎస్ సానుభూతిపరులు కెసిఆర్ ఈస్ బ్యాక్ అంటూ సదరు వీడియోని షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>