MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nanib40d7929-5a14-498e-8fd1-c2dfb7b65d3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nanib40d7929-5a14-498e-8fd1-c2dfb7b65d3a-415x250-IndiaHerald.jpgనానికి తలనొప్పిగా మారిన మెగా హీరోలు? టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ మూవీలో వారం రోజులు వచ్చే కోపాన్ని ఒకే రోజు చూపించే వ్యక్తిగా న్యాచురల్ స్టార్ నాని కనిపిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రతినాయకుడిగా తమిళ స్టార్ యాక్టర్ ఎస్.జె.సూర్యNani{#}Vyjayanthi Movies;indra;Saturday;priyanka;Nani;editor mohan;september;vivek;surya sivakumar;Janasena;Tamil;Success;Chiranjeevi;August;kalyan;Pawan Kalyan;India;News;Hero;Cinemaనానికి తలనొప్పిగా మారిన మెగా హీరోలు?నానికి తలనొప్పిగా మారిన మెగా హీరోలు?Nani{#}Vyjayanthi Movies;indra;Saturday;priyanka;Nani;editor mohan;september;vivek;surya sivakumar;Janasena;Tamil;Success;Chiranjeevi;August;kalyan;Pawan Kalyan;India;News;Hero;CinemaFri, 26 Jul 2024 21:27:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.  దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ మూవీలో వారం రోజులు వచ్చే కోపాన్ని ఒకే రోజు చూపించే వ్యక్తిగా న్యాచురల్ స్టార్ నాని కనిపిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రతినాయకుడిగా తమిళ స్టార్ యాక్టర్ ఎస్.జె.సూర్య నటించాడు. సూర్య పాత్ర ఈ మూవీలో పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. నాని నుంచి వస్తోన్న సినిమా కావడంతో మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయం అందరిలో ఉంది. అందుకే ఈ సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కమర్షియల్ సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. 


ఈ మూవీలో తమిళ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నానికి ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురవుతోంది. రీ రిలీజ్ ట్రెండుతో  ఈ మూవీ రిలీజ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ 'ఇంద్ర' సినిమాను వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున రీరిలీజ్ చేయబోతోంది. ఆగస్టు 22న ఇంద్ర సినిమాని ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కనీసం వారం రోజులు రన్ టైం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టర్ చిరంజీవి కాబట్టి కొత్త టెన్షన్ ఉంటుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. జనసేన ఎన్నికలలో గెలుపు తర్వాత పవర్ స్టార్ నుంచి థియేటర్స్ లో వస్తోన్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ సందడి ఉంటుంది. రీరిలీజ్ అయిన ఈ సినిమాకి ఆదరణ ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల మధ్యలో సరిపోదా శనివారం నలిగిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల ఓపెనింగ్స్ తక్కువ రావచ్చు. దాంతో మెగా హీరోలు నానికి పెద్ద తలనొప్పిగా మారారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>