MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu-fcc393bd-e5d6-4e56-a222-290163f1fdf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu-fcc393bd-e5d6-4e56-a222-290163f1fdf1-415x250-IndiaHerald.jpgSSMB29: సూపర్ స్టార్ కోసం ఆ సూపర్ లొకేషన్స్ ఫిక్స్ చేసిన జక్కన్న? సూపర్ స్టార్ బాబు నెక్స్ట్ మూవీపై అంచనాలు చాలా భారీగా పెరిగిపోయాయి. టాప్ దర్శకుడు రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇంకా అలాగే ఈ టైటిల్‌పై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది.ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రాజమౌళి ప్రతి సినిమాకి పర్ఫెక్షన్ కోసం చాలా సమయం కేటాయిస్తుంటారు. మహేష్ బాబుతో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎMahesh Babu {#}mahesh babu;prasad;Rajamouli;Prabhas;gold;Darsakudu;Thriller;Indian;News;ram pothineni;CBN;Industry;Cinema;DirectorSSMB29: సూపర్ స్టార్ కోసం సూపర్ లొకేషన్స్ ఫిక్స్ చేసిన జక్కన్న?SSMB29: సూపర్ స్టార్ కోసం సూపర్ లొకేషన్స్ ఫిక్స్ చేసిన జక్కన్న?Mahesh Babu {#}mahesh babu;prasad;Rajamouli;Prabhas;gold;Darsakudu;Thriller;Indian;News;ram pothineni;CBN;Industry;Cinema;DirectorFri, 26 Jul 2024 20:50:00 GMTసూపర్ స్టార్ బాబు నెక్స్ట్ మూవీపై అంచనాలు చాలా భారీగా పెరిగిపోయాయి. టాప్ దర్శకుడు రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇంకా అలాగే ఈ టైటిల్‌పై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది.ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రాజమౌళి ప్రతి సినిమాకి పర్ఫెక్షన్ కోసం చాలా సమయం కేటాయిస్తుంటారు. మహేష్ బాబుతో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే రాజమౌళి ఫస్ట్ టైం ఒక టాప్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోలైనా రాజమౌళి వారితో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు వారు చిన్న హీరోలే. కానీ మహేష్ మాత్రం 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ హీరో. అటువంటి హీరోతో మూవీ అంటే రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు కూడా ఎలాంటి అప్డేట్ రాదు అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి 'గోల్డ్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే విజయంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. 


ఇండియానా జోన్స్ తరహాలో ఈ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కారడవుల్లో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ అడవుల్లో మహేష్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట. లొకేషన్స్ వేట కూడా పూర్తయిపోయిందని అంటున్నారు. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో, దీనికి తగ్గట్టుగానే ఫారిన్ లొకేషన్స్, విదేశీ అడవుల్లో చిత్రీకరించనున్నారు. దీని కోసం దర్శకుడు ఇంతకముందెన్నడూ ఇండియన్ స్క్రీన్ మీద చూడని సరికొత్త లొకేషన్స్ ఎంచుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.రాజమౌళి ఆ మధ్య నార్వేలోని పల్పిట్‌ రాక్స్ ను సందర్శించారు. అలానే మహేష్ బాబు జర్మనీలోని అతి పెద్దదైన బ్లాక్ ఫారెస్ట్ లో కూడా ట్రెక్కింగ్ చేసారు. దీంతో ఆ రెండు లొకేషన్స్ లోనూ ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయనే సమాచారం వినిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు, భారీ సాహసాలకు ఎక్కువ స్కోప్ వుంటుంది. అందుకే అనువైన ప్రదేశాలనే చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని మాత్రం సెట్స్ లో తీయనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద రాజమౌళి టీం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని జక్కన్న చెబుతూ వస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>