PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/india-has-given-buddha-to-world-not-yudh1bb13dc5-de0c-4365-9eac-47d659f2ed1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/india-has-given-buddha-to-world-not-yudh1bb13dc5-de0c-4365-9eac-47d659f2ed1a-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తెలుగు రాష్ట్రాలపై చూపించే ప్రేమ కపట ప్రేమ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ పాలనలో రాష్ట్రానికి మంచి జరగలేదని చాలామంది ఫీలవుతున్నారు. మోదీ సర్కార్ మాటలు ఉన్నంత తియ్యగా చేతలు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విషయంలో మోదీకి ఎందుకింత నిర్లక్ష్యం అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. narendra modi{#}prema;Love;Prime Minister;Telugu;Telangana;Narendra Modi;Bharatiya Janata Party;Congress;central governmentమోడీ మాయ : తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కపట ప్రేమ.. మాటలున్నంత తియ్యగా చేతలు ఉండవా?మోడీ మాయ : తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కపట ప్రేమ.. మాటలున్నంత తియ్యగా చేతలు ఉండవా?narendra modi{#}prema;Love;Prime Minister;Telugu;Telangana;Narendra Modi;Bharatiya Janata Party;Congress;central governmentFri, 26 Jul 2024 07:40:00 GMTకేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తెలుగు రాష్ట్రాలపై చూపించే ప్రేమ కపట ప్రేమ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ పాలనలో రాష్ట్రానికి మంచి జరగలేదని చాలామంది ఫీలవుతున్నారు. మోదీ సర్కార్ మాటలు ఉన్నంత తియ్యగా చేతలు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విషయంలో మోదీకి ఎందుకింత నిర్లక్ష్యం అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఆ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీకి 15,000 కోట్లు ఇస్తామని పోలవరంను పూర్తి చేస్తామని కేంద్రం మాటల్లో చెబుతున్నా ఆ నిధులకు సంబంధించిన షరతులు ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతున్నా బీజేపీకి మాత్రం ఈ రాష్ట్రాలు పెద్దగా ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కార్ ప్రకటించే కేంద్ర బడ్జెట్ అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా ఉన్నా వాస్తవంగా కలిగే ప్రయోజనాలు మాత్రం పెద్దగా లేవనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మరోవైపు బీజేపీపై విమర్శలు చేసే బలమైన నేతలు లేకపోవడం, విమర్శించిన పార్టీల ప్రముఖ నేతలు ఇతర కేసుల్లో చిక్కుకొని జైలు శిక్ష అనుభవిస్తూ ఉండటం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మోదీ సర్కార్ నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు సైతం సైలెంట్ గా ఉంటున్నారు. బీజేపీ నేతల మాటలు ఉన్నంత తియ్యగా చేతలు అయితే లేవని చెప్పవచ్చు. గ్రాంట్ల రూపంలో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ఏపీకి మేలు చేసే అవకాశం ఉన్నా కేంద్రం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>