MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-prashanth-neel-31-movie832a26ef-1397-4d38-a6ba-8a82996f6ba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-prashanth-neel-31-movie832a26ef-1397-4d38-a6ba-8a82996f6ba1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా పైన రోజు రోజుకి బజ్ అయితే పెరుగుతూ వస్తోంది. ఈ సినిమాకి ఊహించని విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి రావడంతో అభిమానులు ఆనంద పడుతున్నారు.. ముఖ్యంగా ఈ చిత్రానికి డ్రాగన్ అనే ఒక టైటిల్ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కెరియర్ లోనే చేయలేని ఒక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దేవర, వార్ సినిమాలు పూర్NTR;PRASHANTH NEEL;31 MOVIE{#}NTR;Jr NTR;koratala siva;prasanth;Mythri Movie Makers;Prashant Kishor;september;Hero;Director;Cinema;News;warJr. NTR - Prashant Neel: క్రేజీ అప్డేట్.. బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?Jr. NTR - Prashant Neel: క్రేజీ అప్డేట్.. బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?NTR;PRASHANTH NEEL;31 MOVIE{#}NTR;Jr NTR;koratala siva;prasanth;Mythri Movie Makers;Prashant Kishor;september;Hero;Director;Cinema;News;warFri, 26 Jul 2024 08:50:00 GMTటాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా పైన రోజు రోజుకి బజ్ అయితే పెరుగుతూ వస్తోంది. ఈ సినిమాకి ఊహించని విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి రావడంతో అభిమానులు ఆనంద పడుతున్నారు.. ముఖ్యంగా ఈ చిత్రానికి డ్రాగన్ అనే ఒక టైటిల్ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కెరియర్ లోనే చేయలేని ఒక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.


దేవర, వార్ సినిమాలు పూర్తయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరయర్లో ఎప్పుడు చేయలేని ఒక పాత్రలో చేయబోతున్నారట. ముఖ్యంగా ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని ఒక పాత్ర 75 ఏళ్ల వృద్ధుడిగా అలాగే మరొక పాత్ర ఒక మాఫియా డాన్ గా చూపించే విధంగా ప్రశాంత్ నిల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లో వార్-2 సినిమాలో కూడా ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ లైన్ అప్ చూసి అభిమానులు సినిమాల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డ్రాగన్ సినిమాకి సంబంధించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా నటీనటుల విషయాలను సినిమాకి సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా తెలియజేయలేదు. దేవర సినిమా మాత్రం ఈ ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>