MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vsc90ac5ee-4ffc-4093-827c-1b5976f036b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vsc90ac5ee-4ffc-4093-827c-1b5976f036b7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ఏర్పరచుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు తానే దర్శకత్వం వహిస్తూ , తానే హీరోగా నటిస్తూ పలకనామా దాస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఈమేజ్ దక్కింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈయన చాలా సినిమాలలో నటించగా అందులో ఒకటి , రెండు తప్పిస్తే అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే vs{#}anjali;choudary actor;neha shetty;ram talluri;Diwali;Sony;Viswak sen;October;Music;Godavari River;Mass;Yuva;Ravi;ravi teja;Heroine;Telugu;sree;Hero;Cinemaభారీ ధరకు మెకానిక్ రాఖీ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. విశ్వక్ క్రేజ్ మామూలుగా లేదుగా..?భారీ ధరకు మెకానిక్ రాఖీ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. విశ్వక్ క్రేజ్ మామూలుగా లేదుగా..?vs{#}anjali;choudary actor;neha shetty;ram talluri;Diwali;Sony;Viswak sen;October;Music;Godavari River;Mass;Yuva;Ravi;ravi teja;Heroine;Telugu;sree;Hero;CinemaFri, 26 Jul 2024 10:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ఏర్పరచుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు తానే దర్శకత్వం వహిస్తూ , తానే హీరోగా నటిస్తూ పలకనామా దాస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఈమేజ్ దక్కింది. 

ఇకపోతే ఇప్పటి వరకు ఈయన చాలా సినిమాలలో నటించగా అందులో ఒకటి , రెండు తప్పిస్తే అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఆఖరుగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , అంజలి మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు మెకానిక్ రాఖీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రవితేజ మల్లపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... రామ్ తాళ్లూరిమూవీ ని నిర్మిస్తున్నాడు. జాక్స్ బీజాయ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మీనాక్షి చౌదరి , శ్రద్ధ శ్రీ నాథ్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సంస్థ వారు భారీ ధరకు ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>