PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan3e4a2995-5d32-4ade-84ca-595eb4aa3fc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan3e4a2995-5d32-4ade-84ca-595eb4aa3fc4-415x250-IndiaHerald.jpgఆధ్యాత్మిక నగరి తిరుపతి సీటును జనసేన కైవసం చేసుకోవడం కూడా శుభసూచికంగానే భావించారు ప్రజలు. భారీ మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు గెలిచారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటును జనసేన కూడా అదే స్థాయిలో పరిగణించింది. పొత్తుల ఖరారు ముందు నుంచి సీట్ల కేటాయింపుల వరకు ఇలా ఆది నుంచి ఎన్నో గొడవలు, ఎన్నో వివాదాలు, చర్చలు జనసేనలో సాగుతూ వచ్చాయి. ఎన్నికల సమయంలో అన్ని సర్దుకున్నట్టు కనిపించిన ఎన్నికల అనంతరం పార్టీ కోసం నిజంగా కష్టపడిన కార్యకర్తలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారpawan kalyan{#}abinaya;kiran;AdiNarayanaReddy;MLA;Nagari;Shadow;Siva Kumar;Tirupati;Janasena;YCP;Partyజనసేనలో అంతర్యుద్ధం.. వైసీపీ నేతలకు ప్రాధాన్యత ?జనసేనలో అంతర్యుద్ధం.. వైసీపీ నేతలకు ప్రాధాన్యత ?pawan kalyan{#}abinaya;kiran;AdiNarayanaReddy;MLA;Nagari;Shadow;Siva Kumar;Tirupati;Janasena;YCP;PartyFri, 26 Jul 2024 09:15:10 GMTఆధ్యాత్మిక నగరి తిరుపతి సీటును జనసేన కైవసం చేసుకోవడం కూడా శుభసూచికంగానే భావించారు ప్రజలు. భారీ మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు గెలిచారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటును జనసేన కూడా అదే స్థాయిలో పరిగణించింది. పొత్తుల ఖరారు ముందు నుంచి సీట్ల కేటాయింపుల వరకు ఇలా ఆది నుంచి ఎన్నో గొడవలు, ఎన్నో వివాదాలు, చర్చలు జనసేనలో సాగుతూ వచ్చాయి. ఎన్నికల సమయంలో అన్ని సర్దుకున్నట్టు కనిపించిన ఎన్నికల అనంతరం పార్టీ కోసం నిజంగా కష్టపడిన కార్యకర్తలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.


అందుకు కారణంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వ్యవహార శైలి చుట్టూనే ఈ చర్చ అంతా నడుస్తోంది. ఎన్నికలకు ముందు టికెట్ కోసం పోటిపడ్డ వారిని కూడా ఇప్పుడు టార్గెట్ చేశారట ఎమ్మెల్యే శ్రీనివాసులు. దీనిపైన జనసైనికులు పలు విధాలుగా చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించిన వారిని లోలోపల ఆపి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఎమ్మెల్యే. పార్టీ కార్యక్రమాల్లోనే కాక ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా కొందరు నేతలకు ఆహ్వానం అందడం లేదనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.


కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి వంటి నేతలను దూరం పెట్టారనే వాదన కూడా ఉంది. ఇక ఇదే సమయంలో వైసీపీ నేత అభినయ రెడ్డి అనుచరుడు బండ్ల లక్ష్మీపతి ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే ఆరని, తిరుపతి రుయా  హాస్పిటల్ బోర్డు మెంబర్ గా కీలక పదవిని కట్టబెట్టారట. దీనిపై జన సైనికులు, ఎమ్మెల్యేను పట్టించుకోవడం లేదనే బలమైన వాదన నడుస్తోంది. వైసీపీతో అంటకాగినవారికి తిరుపతి ఎమ్మెల్యే కుర్చీలు వేయడం వెనక మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని ఇక్కడ జనసైనికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకరిద్దరు జనసేన ముఖ్య నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాసులతోపాటు ఆరని శివకుమార్ కు భజన చేయడమే.... ఎమ్మెల్యే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణంగా చెప్పుకుంటున్నారు.


ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి 100 మందికి పైగా జనసేనలోకి చేరారట. అలా చేసినందుకు ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారని చర్చ నడుస్తోంది. దీని వెనకాల పెద్ద కథ నడిచిందని జనసేన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినప్పటికీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేది మాత్రం ఆరని శివకుమార్ అనే పేరు ఉంది. పార్టీ వ్యవహారాలతో పాటుగా అధికారికంగా ఏం చేయాలన్నా శివకుమార్ ఆదేశం తప్పనిసరి అనే వ్యాఖ్యలు జనసేన ఇన్నర్ సర్కిల్స్ లో నడుస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>