Astrologylakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_today/sravanamasam--sravanamasam-updates-sravanamasam-7599788f-ee4d-4e2a-b90d-6ce7583bbbc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_today/sravanamasam--sravanamasam-updates-sravanamasam-7599788f-ee4d-4e2a-b90d-6ce7583bbbc8-415x250-IndiaHerald.jpgశ్రావణమాసం ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో తెలుసా...? మరికొన్ని రోజుల్లో ఆషాడ మాసం ముగిసిపోతుంది. శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. చంద్రుడు శ్రావణా నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణమాసం గా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణమాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఐదాది. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జులై 22 నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్లు అనుసరించేది చంద్రమాన క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావSravanamasam ; Sravanamasam updates; Sravanamasam {#}Moon;Nakshatram;monday;Friday;sree;Teluguశ్రావణమాసం ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో తెలుసా...?శ్రావణమాసం ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో తెలుసా...?Sravanamasam ; Sravanamasam updates; Sravanamasam {#}Moon;Nakshatram;monday;Friday;sree;TeluguThu, 25 Jul 2024 17:14:00 GMTమరికొన్ని రోజుల్లో ఆషాడ మాసం ముగిసిపోతుంది. శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. చంద్రుడు శ్రావణా నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణమాసం గా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణమాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఐదాది. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జులై 22 నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్లు అనుసరించేది చంద్రమాన క్యాలెండర్.


దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 5నుంచి ప్రారంభం అవుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వత్రాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణా నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. ఈ మాసంలో మహిళలు అనేక ప్రాతాలను ఆచరిస్తారు.భర్తకు దీర్ఘియువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు. పార్వతీ దేవికి ఉన్న మరొక పేరు మంగళ గౌరీ.


కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీ దేవిని ఈరోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల అభిప్రాయం.శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు, శమీ ఆకులు సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>