PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-bhuvaneswari-chandrababu-wife-nara-bhuvaneswari-lokesh-balayya-tdp95868309-01eb-48ae-a513-571df0b421de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-bhuvaneswari-chandrababu-wife-nara-bhuvaneswari-lokesh-balayya-tdp95868309-01eb-48ae-a513-571df0b421de-415x250-IndiaHerald.jpgనారా భువనేశ్వరి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భార్య.. మంత్రి లోకేష్ కు తల్లి... హీరో నందమూరి బాలకృష్ణ చెల్లి.. ఇలా ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. అంతేకాదు నారా భువనేశ్వరి సక్సెస్ఫుల్ మహిళా పారిశ్రామిక‌ వేత్త కూడా.. హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా ఆమె నడుపుతున్నారు. ఇలా మంచి కూతురు... మంచి భార్య, తల్లి.. చెల్లి.. వ్యాపారవేత్తగా ఉన్న ఆమె ఇప్పుడు మంచి రాజకీయ నNara Bhuvaneswari; chandrababu wife Nara Bhuvaneswari; lokesh; balayya; tdp{#}bhuvaneshwari;kuppam;Heritage Foods;Nara Bhuvaneshwari;Balakrishna;Hero;CBN;Telangana Chief Minister;Manam;Minister;Andhra Pradesh;Partyయాక్టివ్ పాలిటిక్స్‌లోకి నారా భువ‌నేశ్వ‌రి... ఆ అసెంబ్లీ సీటుపై క‌న్నేశారుగా..?యాక్టివ్ పాలిటిక్స్‌లోకి నారా భువ‌నేశ్వ‌రి... ఆ అసెంబ్లీ సీటుపై క‌న్నేశారుగా..?Nara Bhuvaneswari; chandrababu wife Nara Bhuvaneswari; lokesh; balayya; tdp{#}bhuvaneshwari;kuppam;Heritage Foods;Nara Bhuvaneshwari;Balakrishna;Hero;CBN;Telangana Chief Minister;Manam;Minister;Andhra Pradesh;PartyThu, 25 Jul 2024 10:37:00 GMTనారా భువనేశ్వరి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భార్య.. మంత్రి లోకేష్ కు తల్లి... హీరో నందమూరి బాలకృష్ణ చెల్లి.. ఇలా ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. అంతేకాదు నారా భువనేశ్వరి సక్సెస్ఫుల్ మహిళా పారిశ్రామిక‌ వేత్త కూడా.. హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా ఆమె నడుపుతున్నారు. ఇలా మంచి కూతురు... మంచి భార్య, తల్లి.. చెల్లి.. వ్యాపారవేత్తగా ఉన్న ఆమె ఇప్పుడు మంచి రాజకీయ నాయకురాలుగా అనిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


భర్త చంద్రబాబు జైలుకు వెళ్లడంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన భువనేశ్వరి ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. భువనేశ్వరి రాజకీయ రంగ ప్రవేశం పై రకరకాల ప్రచారం కూడా జరుగుతుంది. తాజాగా భువనేశ్వరి భర్త చంద్రబాబు ప్రాతినిత్యం వ‌హిస్తున్న కుప్పం నియోజకవర్గ పర్యటన ఆసక్తిగా మారింది. వాస్తవానికి గత ఎన్నికల ప్రచారం ముందు నుంచే భువనేశ్వరి ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంలో ఫోకస్ పెడుతూ వచ్చారు. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె కుప్పంలో పర్యటించి నియోజకవర్గ సమన్వయ కమిటీతో సమావేశం అయ్యారు.


రాజకీయాలు .. వ్యాపార రంగంలో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యమని.. దీన్ని తాను బలంగా నమ్ముతానని భువనేశ్వరి తెలిపారు. ఈ టీం వర్క్ వల్లే రాష్ట్రంలో మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నారు. మనం గెలిచామని... ఆ గెలుపు ప‌లాలను ప్రజలకు అందించాలన్నదే సమన్వయ కమిటీ ల‌క్ష్యం అని భువనేశ్వరి సూచించారు ఇక కుప్పం పర్యటనలో సామాన్యులంతా రోడ్లు .. లైట్లు .. కొళాయిలు ... రెవెన్యూ సమస్యలు తన దృష్టికి తీసుకువస్తున్నారని వాటిపై సమన్వయ కమిటీ ... పార్టీ అధినాయకత్వం దృష్టిపెట్టాలని భువనేశ్వరి సూచించారు.


తాను ప్రతి మూడు నెలలకు నియోజకవర్గానికి వస్తానని ఇక్కడ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏది ఏమైనా నారా భువనేశ్వరి దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>