Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7f51b686-2450-48b1-8c1a-677fae1071a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7f51b686-2450-48b1-8c1a-677fae1071a0-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం ఎంతో జోరుగా కొనసాగుతోంది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోవడం సంచలనగానే మారిపోయింది. ఇప్పటివరకు ఏకంగా 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరిపోయారు అయితే ఇక ఈ జంపింగ్లు తెలంగాణలోనే కాదు ఇప్పుడు ఆంధ్రలో కూడా మొదలయ్యాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు అధికారంలో ఉన్న వైసిపి కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 151 Jagan{#}Car;Telangana;Telugu;Congress;Hanu Raghavapudi;Party;Assembly;YCP;Jaganవైసీపీ వికెట్లు టపా టపా : అదే జరిగితే.. పార్టీ విలీనం ఒక్కటే దారి?వైసీపీ వికెట్లు టపా టపా : అదే జరిగితే.. పార్టీ విలీనం ఒక్కటే దారి?Jagan{#}Car;Telangana;Telugu;Congress;Hanu Raghavapudi;Party;Assembly;YCP;JaganThu, 25 Jul 2024 08:28:00 GMTఈ మధ్యకాలంలో అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం ఎంతో జోరుగా కొనసాగుతోంది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోవడం సంచలనగానే మారిపోయింది. ఇప్పటివరకు ఏకంగా 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరిపోయారు  అయితే ఇక ఈ జంపింగ్లు తెలంగాణలోనే కాదు ఇప్పుడు ఆంధ్రలో కూడా మొదలయ్యాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు అధికారంలో ఉన్న వైసిపి కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.


 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీకి 2024 ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక వైసిపి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా లేకపోతే కూటమిలోని ఏదో ఒక పార్టీకి చేరుకొని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటారా అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.  ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఒక్కొక్కరుగా పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా ఇక ఫ్యాన్ పార్టీని వీడుతూ ఉన్నారు.


 ఎన్నికల ముందే కొంతమంది నేతలు టిడిపిలో చేరిక ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇంకొంతమంది తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలంటే.. ఇక పార్టీ మారాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. మొన్నటి వరకు జగన్ వెన్నంటే ఉంటాము అంటూ బల్ల గుద్ది చెప్పిన నేతలు సైతం ఇప్పుడు నిర్మొహమాటంగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే 11 సీట్లు మాత్రమే గెలిచిన జగన్ అయోమయంలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్న నేతలు కూడా పార్టీని విడుతుండడంతో ఆయనకు వణుకు పుట్టుకుంది అన్నది తెలుస్తుంది. ఒకవేళ వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని వెళితే చివరికి వైసిపి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.


 వచ్చే ఎన్నికల్లో పుంజుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఏకంగా వైసీపీని మరో పార్టీలో విలీనం చేయాల్సిన దుస్థితి వస్తుంది. దీంతో ఒకవేళ పార్టీని విలీనం చేయాల్సి వస్తే ఏ పార్టీలో విలీనం చేస్తారో అనే విషయంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.  ఇలాంటి పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న పార్టీని ఇక ఇప్పుడు జగన్ మళ్ళీ ఎలా నిలబెట్టుకోగలుగుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>