PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycped4d0029-4d9c-47d3-818b-1a43c4aab7ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycped4d0029-4d9c-47d3-818b-1a43c4aab7ee-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో చూసిన ఎలక్షన్లకు కొంతకాలం ముందు , ఎలక్షన్ల పూర్తి అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ను బట్టి అనేక మంది నేతలు పార్టీలు మారడం , ఆ పార్టీ నుండి పూర్తిగా పక్కకు తప్పుకోవడం అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి కొంత మంది నేతలు టికెట్ ధక్కకపోవడం వల్ల , మరికొన్ని కారణాల వల్ల ఎలక్షన్లకు ముందే పార్టీ మారిన వారు ఉన్నారు. ఇక ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ ను ycp{#}Rajani kanth;Letter;TDP;Parliment;Guntur;Telugu Desam Party;రాజీనామా;Hanu Raghavapudi;MLA;Assembly;YCP;Andhra Pradesh;Party;Ministerవైసీపీ వికెట్లు టపాటపా : గిరిధర్ రావు అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?వైసీపీ వికెట్లు టపాటపా : గిరిధర్ రావు అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?ycp{#}Rajani kanth;Letter;TDP;Parliment;Guntur;Telugu Desam Party;రాజీనామా;Hanu Raghavapudi;MLA;Assembly;YCP;Andhra Pradesh;Party;MinisterThu, 25 Jul 2024 10:12:00 GMTదేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో చూసిన ఎలక్షన్లకు కొంతకాలం ముందు , ఎలక్షన్ల పూర్తి అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ను బట్టి అనేక మంది నేతలు పార్టీలు మారడం , ఆ పార్టీ నుండి పూర్తిగా పక్కకు తప్పుకోవడం అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి కొంత మంది నేతలు టికెట్ ధక్కకపోవడం వల్ల , మరికొన్ని కారణాల వల్ల ఎలక్షన్లకు ముందే పార్టీ మారిన వారు ఉన్నారు. ఇక ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ ను బట్టి పార్టీ మారిన నేతలు కూడా ఉన్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి అత్యంత భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు రాగా , వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి.

దానితో ఈ పార్టీని వదిలి చాలా మంది పక్క పార్టీలోకి వెళుతున్నారు. ఇక వైసిపి పార్టీలో అత్యంత కీలక నేత మరియు సీనియర్ అయినటువంటి గిరిధర్ రావు కూడా ఇప్పటికే వైసీపీ కి గుడ్ బై చెప్పేసాడు. గుంటూరు జిల్లాలో వైసీపీకి కీలక అయిన ఈయన మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (మద్దాలి గిరి) వైసీపీకి రాజీనామా చేయడం ఈ పార్టీకి అత్యంత గట్టిదబ్బగా చెప్పుకోవాల్సి వస్తుంది.

ఈ మేరకు కొన్ని రోజుల క్రితం వైఎస్ జగన్‌కు లేఖ ద్వారా తన నిర్ణయాన్ని ఈయన తెలియజేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మద్దాలి గిరి లేఖలో తెలియ తెలియజేశారు. పార్టీకి రాజీనామా చేసేంతవరకు ఈయన గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు.

అయితే వ్యక్తిగత కారణాలతో గుంటూరు వైసీపీ అధ్యక్ష పదవికి , వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మద్దాలి గిరి తన లేఖలో స్పష్టం చేశారు. 2019 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున మద్దాలి గిరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవటంతో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆ సమయంలో పార్టీ మారారు.

ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా కొనసాగారు. ఈ నేపథ్యంలోనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి మరోసారి పోటీచేయాలని ఈయన భావించారు. అయితే ఆయనకు వైసీపీ అధిష్టానం భారీ షాక్ ను ఇచ్చింది. మాజీ మంత్రి విడదల రజినీ కి ఈ ప్రాంత సీటును కేటాయించారు. దీనితో గిరి చాలా నిరాశకు గురయ్యారు.

ఇక ఎన్నికల తర్వాత వైసీపీ ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇక దానితో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈయన రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలోకి గాని వేరే పార్టీలోకి గాని చేరుతారా ... లేక అలాగే ఉండిపోతారా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>