PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yv-subbareddy39d2fa8e-c6d9-4dca-b22b-716d9851c810-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yv-subbareddy39d2fa8e-c6d9-4dca-b22b-716d9851c810-415x250-IndiaHerald.jpgవై వి సుబ్బారెడ్డి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో కీలకనేతగా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి తనదైన మార్క్ పాలనతో వైసిపి పెద్దమనుషుల మనసులను దోచుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగానే బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మాజీ మంత్రుల సెక్యూరిటీ బలగాన్ని కుదిరించడం జరిగింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు... ఈ విషయంలో వై వి సుబ్బారెడ్డి కొన్నాళ్ల క్రితం హైకోర్టుని ఆశ్రయించడం జYV Subbareddy{#}High court;V;Reddy;YCP;Telugu;TDP;Andhra Pradesh;Governmentబాబుకి షాకిచ్చిన వైవీ సుబ్బారెడ్డి... కీలక ఆదేశాలు!బాబుకి షాకిచ్చిన వైవీ సుబ్బారెడ్డి... కీలక ఆదేశాలు!YV Subbareddy{#}High court;V;Reddy;YCP;Telugu;TDP;Andhra Pradesh;GovernmentThu, 25 Jul 2024 15:13:00 GMTవై వి సుబ్బారెడ్డి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో కీలకనేతగా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి తనదైన మార్క్ పాలనతో వైసిపి పెద్దమనుషుల మనసులను దోచుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగానే బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మాజీ మంత్రుల సెక్యూరిటీ బలగాన్ని కుదిరించడం జరిగింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు... ఈ విషయంలో వై వి సుబ్బారెడ్డి కొన్నాళ్ల క్రితం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది.

తన భద్రతను 2+2 నుండి వన్ ప్లస్ వన్ కి కూటమి ప్రభుత్వం కుదించిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాంతో తాజాగా హైకోర్టు తీర్పునిస్తూ కూటమి ప్రభుత్వానికి వై వి సుబ్బారెడ్డి భద్రత 2 + 2 ని కంటిన్యూ చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ తీర్పు ఎప్పుడైతే వెలువడిందో కూటమి పెద్దమనుషుల మనసులు కుదేలయ్యాయి. ఎంపీగా ఆయనకు 2 + 2 భద్రత అనేది చాలా అత్యవసరం అన్నట్టు ఆయన తరపు న్యాయవాదులు వాదించగా హైకోర్టు తాజా తీర్పుని వెలువరించింది.

ఈ నేపథ్యంలోనే ఓ నాలుగు వారాలు పాటు ఆయనకి 2 + 2 భద్రతని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏపీ పోలీసు యంత్రాంగం మొదట ఉపసంహరించుకున్న 2 + 2 కేటగిరి సెక్యూరిటీని వై వి సుబ్బారెడ్డి కి కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో 2 ప్లస్ 2 కేటగిరి భద్రత కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భద్రతాంశాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం  వీరి భద్రతను కూడా కూటమి ప్రభుత్వం కుదిరించడం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>