PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dokka-manikya-vara-prasad2571adb0-50f5-4c0b-8c98-9284e2a7c560-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dokka-manikya-vara-prasad2571adb0-50f5-4c0b-8c98-9284e2a7c560-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల గురించి నామమాత్రపు అవగాహన ఉన్నవాళ్లకు కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కావడం గమనార్హం. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 2020లో వైసీపీలోకి మారారు. dokka manikya vara prasad{#}2020;Smart phone;Telangana;media;రాజీనామా;Guntur;Jagan;Party;CBN;TDPజగన్ పతనాన్ని ముందే ఊహించిన డొక్కా.. పార్టీ మారడమే ఆయనకు మేలు చేసిందా?జగన్ పతనాన్ని ముందే ఊహించిన డొక్కా.. పార్టీ మారడమే ఆయనకు మేలు చేసిందా?dokka manikya vara prasad{#}2020;Smart phone;Telangana;media;రాజీనామా;Guntur;Jagan;Party;CBN;TDPThu, 25 Jul 2024 06:50:00 GMTఏపీ రాజకీయాల గురించి నామమాత్రపు అవగాహన ఉన్నవాళ్లకు కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కావడం గమనార్హం. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 2020లో వైసీపీలోకి మారారు.
 
ఈ ఏడాది ఏప్రిల్ నెల 26వ తేదీన డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. పార్టీ మారడమే ఆయనకు మేలు చేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2020 మార్చిలో వైసీపీలో చేరిన ఆయన జగన్ పతనాన్ని ముందే ఊహించి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పార్టీ మారారు.
 
ఈ ఏడాది వైసీపీకి రాజీనామా చేయడానికి ముందే ఆయన కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చాలామంది నేతలు పార్టీ మారాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు అయితే వర్కౌట్ కావట్లేదు. ఎన్నికలకు ముందే పార్టీ మారడం డొక్కాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.
 
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణ మాదిరి ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు నాయకత్వం వహించారని నా ఫోన్ కూడా ట్యాప్ కావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాబోయే రోజుల్లో ఏ పదవిని స్వీకరిస్తారో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీకి మరిన్ని భారీ షాకులు తగలడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>